మరణమైన తలచలేదు నా మందిరం
జననమైన తెలుపలేదు నా మందిరం
అమృతమైన నా మందిరం మహోదయమైన శరీరమై ఆది కాలం నుండి జీవిస్తున్నదే విశ్వమంతయు
అద్భుతమైన నా మందిరం మహాస్వరూపమైన శరీరమై ఆది భావం నుండి ధ్యానిస్తున్నదే జగమంతయు
జీవ తత్త్వమైన నా మందిరం మహా కార్యాలతో విజ్ఞాన జీవితాలతో అనంతమై ప్రజ్వలిస్తున్నదే సూర్య తేజమై || మరణమైన ||
అంతర్భావాలతోనే జీవించు నా మందిరం అణువణువునా అంతర్లీనమై పరమార్ధంతో పరమాత్మమై పరిశోధిస్తున్నది
అంతరతత్త్వాలతో ధ్యానించు నా మందిరం పరమాణువునా అంతర్యామమై పరిశుద్ధంతో పరంధామమై పరీశీలిస్తున్నది