Saturday, June 29, 2024

విశ్వమే పిలుస్తుందా చిరంజీవా

విశ్వమే పిలుస్తుందా చిరంజీవా 
జగమే ప్రశ్నిస్తుందా చిరస్మరజీవా 

లోకమే తపిస్తుందా చిరంతనజీవా
స్వప్నమే తరిస్తుందా చిరస్మరభావా 

రూపమే తెలుపుతుందా చిరంజనీవా 
నాదమే తెలుపుకుందా చిరస్మరనీవా  

Friday, June 28, 2024

విశ్వాన్ని పలికించే గానం ఏ శృతిలో ఉన్నదో

విశ్వాన్ని పలికించే గానం ఏ శృతిలో ఉన్నదో 
జగాన్ని పరిశోధించే భావం ఏ ధ్యాసలో ఉన్నదో 

ప్రకృతిని పరిశీలించే తత్త్వం ఏ భాషలో ఉన్నదో 
ఆకృతిని పర్యావరణించే గుణం ఏ ద్యుతిలో ఉన్నదో 

రూపాన్ని ప్రఖ్యాతించే దైవం ఏ ధ్వనిలో ఉన్నదో 
నాదాన్ని పరిశుద్దించే వైనం ఏ జ్ఞానిలో ఉన్నదో  



అదృష్టమో దురదృష్టమో తెలియదే మహానుభావా!

అదృష్టమో దురదృష్టమో తెలియదే మహానుభావా!
పరమార్థమో ఆర్థాంతరమో తెలియదే మహానుభావా!

అదృష్టంలోనూ దురదృష్టం కలుగుతుందని భావించలేదు మహానుభావా!
దురదృష్టంలోనూ అదృష్టం కలుగుతుందని భావించలేదు మహానుభావా!

శ్రమించే జీవితంలో అదృష్టం లేకపోతే ఆరోగ్యం విహీనమైపోతుంది 
ఆశించే జీవనంలో అదృష్టం లేకపోతే విజ్ఞానం విచారణమైపోతుంది 

 

Thursday, June 27, 2024

అనగనగా అంటూ ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు

అనగనగా అంటూ ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు 
అదిగదిగో అంటూ ప్రభంజనాన్ని ఎవరు మార్చేస్తారు 

అలగలగా అంటూ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు 
ఇదిగిదిగో అంటూ ప్రభంజనాన్ని ఎవరు ప్రభోదిస్తారు  

Wednesday, June 26, 2024

ఏ గాలి శ్వాసలో ఏ రాగం ఉదయించునో

ఏ గాలి శ్వాసలో ఏ రాగం ఉదయించునో 
ఏ గాలి ధ్యాసలో ఏ భావం ఉద్భవించునో 

ఏ గాలి భాషలో ఏ తంత్రం ప్రసరించునో 
ఏ గాలి యాసలో ఏ తత్త్వం ప్రభవించునో 

దేహంలో ఉన్నావా దేహేశ్వరా

దేహంలో ఉన్నావా దేహేశ్వరా 
రూపంలో ఉన్నావా రూపేశ్వరా 

వేదంలో ఉన్నావా వేదేశ్వరా 
నాదంలో ఉన్నావా నాదేశ్వరా

దైవంలో ఉన్నావా దైవేశ్వరా 
ధర్మంలో ఉన్నావా ధర్మేశ్వరా 

భావంలో ఉన్నావా భావేశ్వరా 
తత్త్వంలో ఉన్నావా తత్త్వేశ్వరా  

పత్రంలో ఉన్నావా పత్రేశ్వరా  
పుష్పంలో ఉన్నావా పుష్పేశ్వరా 

విశ్వంలో ఉన్నావా విశ్వేశ్వరా 
జగంలో ఉన్నావా జగమేశ్వరా 

Wednesday, June 12, 2024

ప్రకృతినే పెంచాను పరిశుద్ధంగా

ప్రకృతినే పెంచాను పరిశుద్ధంగా 
ఆకృతినే ఉంచాను పరిపూర్ణంగా 

జగతినే చేశాను పర్యావరణంగా 
విశ్వతినే మార్చాను పరిశోధనంగా