ఏ అణువును నీవు తాకినా ఆ అణువు స్పందిస్తుంది
ప్రతి అణువు స్పందించుటలో నీవు గ్రహించగలవా అణువుల భావ తత్వాల స్వభావాలను వాటి కార్యాల విధానాలను నీవు గమనించగలవా
అణువులను తాకుటలో తమ స్వభావాలతో స్పందిస్తూ తన తత్వాన్ని మార్చుకోవచ్చు కోల్పోవచ్చు మరో రూపం దాల్చవచ్చు నశించిపోవచ్చు మరణించవచ్చు అదృశ్యం కావచ్చు
విశ్వ ప్రకృతిలో ఉద్భవించే ప్రతి అణువు తమ స్వభావాలతో (గుణ వర్ణ లక్షణ కాల స్థితులతో) జీవిస్తూ కాలంతో స్పందిస్తూ సాగుతుంది
అణువులను మరో అణువు తాకినా లేదా ఇతర పదార్థాలను తాకినా తమ జీవిత కాలంలో రూపాంతరాన్ని మార్చుకోవచ్చు
ఒక్కొక్క అణువు ఒక్కొక్క రకంగా వివిధ రకాలుగా కాల ప్రభావాలకు స్పందిస్తూ జీవించవచ్చు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment