తల్లీ! నీవు సృష్టించిన హృదయంలో నిరంతరమైన హృదయ స్పందన అనంత విశ్వ ప్రకృతి కాల భావాల జీవముల స్వభావాల తత్వాలతో అనేక కార్యాలతో అపూర్వమైన మేధస్సు గమనంతో ఎన్నింటినో అర్థాలుగా విజ్ఞాన వేదాలుగా గ్రహిస్తూ జీవిస్తున్నది
శతాబ్దాలుగా జీవించుటలో నీవు సృష్టించిన మానవ రూపం అఖండమై ఆశ్చర్యమైన విజ్ఞానాన్ని సాధన చేస్తూ అద్భుతాలను అనేక రకాల సౌకర్యాలతో నిర్మిస్తున్నది
నీవు సృష్టించే మానవ యంత్రం మహోదయమై బ్రంహాండమంతా పరిభ్రమిస్తూ అనంతమైన విశ్వ కార్యాలను శాస్త్రీయ సిద్ధాంతాలను పరిశోధిస్తూ జీవిస్తున్నది
నేటి మానవ తరం యంత్రాల తరంగా సాగుతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment