Friday, August 29, 2025

గణితంలో ఉంది గుణింతం అలాగే జీవితంలో ఉంది జనతం

గణితంలో ఉంది గుణింతం అ లాగే జీవితంలో ఉంది జనతం (జీవనం)


-- వివరణ ఇంకా ఉంది!

తెలియకుండ పొరపాటు జరిగితే క్షమింపబడతావు తెలిసి పొరపాటు చేస్తే శిక్షింపబడతావు

తెలియకుండ పొరపాటు జరిగితే క్షమింపబడతావు తెలిసి పొరపాటు చేస్తే శిక్షింపబడతావు  

నిన్ను శిక్షింపలేకపోతే క్రమశిక్షణ కలిగేందుకు సత్ప్రవర్తనకై శిక్షణ పొందుతావు 

శిక్షణ ఉన్న వారికి శిక్ష అవసరం ఉండదు 
శిక్షణ లేని వారికి శిక్షపడే అవసరం కలగవచ్చు 
 
శిక్షణ ఉన్న వారికి సుగుణం అభివృద్ధి అవుతుంది 
శిక్షణ లేనివారికి క్రమశిక్షణ ఎంతో అవసరం 
శిక్షలో లేదా శిక్షతో కూడా క్రమశిక్షణ పొందవచ్చు సుగుణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు 

శిక్షణ విజ్ఞానాన్ని సూచిస్తుంది శిక్ష అజ్ఞానాన్ని వదిలిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, August 27, 2025

అదుపు పొదుపు ఉంటే ఎవరైనా త్వరగా అభివృద్ధి చెందవచ్చు

అదుపు పొదుపు ఉంటే ఎవరైనా త్వరగా అభివృద్ధి చెందవచ్చు  

అదుపు పొదుపుతో పాటు కాస్త విజ్ఞాన నైపుణ్యం కార్యాక్రమ శ్రమం ఉంటే అభివృద్ధిని సాధించవచ్చు 

వచ్చిన ఐశ్వర్యాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు అలాగే ఎవరికైనా ఇచ్చే ఐశ్వర్యాన్ని అనవసరంగా ఆలస్యం చేయకూడదు 

చిన్న చిన్న సంతోషాల కోసం ఖర్చులను చేసుకుంటూ పోతే చిరకాలం లభించే అభివృద్ధి సంతోషం జీవిత కాలంలో లభించకుండా పోతుంది 

ఆరోగ్యంతో శ్రమిచాలి ఆరోగ్యంతో ఆలోచించాలి ఆరోగ్యంతో జీవించాలి ఆరోగ్యంతో ప్రయాణించాలి ప్రశాంతతో సాగిపోవాలి అప్పుడే అన్నీ సమకూరగలవు పొదుపు చేయగలవు 

ఐశ్వర్యం ఉన్న చోట కార్యక్రమాలు సాఫల్యతతో సాగిపోతాయి 


నిప్పు నిప్పు రాసుకుంటే గాలికి మంట ఏర్పడుతుంది అలాగే పొదుపు పొదుపు జత చేర్చితే కొంత కాలానికి వడ్డీ (లాభం, ఫలం, అభివృద్ధి) చేరుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రజల శక్తి సామర్త్యాలతో (ధనం, విజ్ఞానంతో) ప్రజలకు మేలు చేసేవాడు నాయకుడు

ప్రజల శక్తి సామర్త్యాలతో (ధనం, విజ్ఞానంతో) ప్రజలకు మేలు చేసేవాడు నాయకుడు 
తన శక్తి సామర్థ్యాలతో (ధనం, విజ్ఞానంతో) ప్రజలకు మేలు చేసేవాడు మహాత్ముడు  

నాయకుడు ఏ సంస్థలోనైనా ఏ సంఘంలోనైనా ఉంటాడు మహాత్ముడే అనేక ప్రాంతాలకు ఒక్కడు ఉంటాడు 

ప్రజల పరిపాలన నాయకుడితో సాగుతుంది 
కార్యాల పరిపాలన మహాత్ముడితో జరిగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Saturday, August 23, 2025

ఓ శ్వాస! ఉచ్చ్వాసను ఆపుకోవద్దు ఓ మహా శ్వాస! నిచ్చ్వాసను వదులుకోవద్దు

ఓ శ్వాస! ఉచ్చ్వాసను ఆపుకోవద్దు ఓ మహా శ్వాస! నిచ్చ్వాసను వదులుకోవద్దు  (విడుచుకోవద్దు)

శ్వాసకు ఉచ్చ్వాస ఎంత ముఖ్యమో నిచ్ఛ్వాస కూడా అంతే ప్రాముఖ్యత  
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే శ్వాసకు ప్రఖ్యాత దేహానికి ప్రాముఖ్యత జీవికి ఆరోగ్యత 

శ్వాస ఉన్నంతవరకు దేహం జీవిస్తుంది మేధస్సు ఆలోచిస్తుంది హృదయం ప్రభవిస్తుంది శరీరం శ్రమిస్తుంది కాలం కార్యక్రమాలతో నడిపిస్తుంది విశ్వం ప్రకృతితో దర్శనమిస్తుంది దైవం స్మరణిస్తూ ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవికి అవసరాలు ఉన్నాయి మానవునికి మాత్రమే కోరికలు ఉన్నాయి

ప్రతి జీవికి అవసరాలు ఉన్నాయి మానవునికి మాత్రమే కోరికలు ఉన్నాయి  

మానవుడు తన విజ్ఞానంతో అవసరాలతో పాటు కోరికలను కూడా సృష్టించుకుంటున్నాడు 

మానవుడు తన అనుభవాలను కోరికల కోసం శ్రమిస్తూ ఫలితాలను పొందుతున్నాడు 
చిన్న చిన్న కోరికల కోసం తన అవసరాలను మరచిపోతూ శ్రమను వృధా చేస్తుకుంటున్నాడు 

అనవసరమైన ఖర్చులను పొదుపు చేసుకుంటే అవసరమైన ముఖ్యమైన వాటిని నెరవేర్చుకోవచ్చు పొందవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రకృతిలో సహజ వనరులు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎన్నున్నాయో

ప్రకృతిలో సహజ వనరులు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎన్నున్నాయో ఎంత మేరకు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎంత కాలం జీవులకు (మానవులకు) ఉపయోపడుతాయో ఎవరూ గ్రహించలేరు   

ప్రకృతి సృష్టించిన సహజ వనరులను మానవుడు ఎంత మాత్రం వృధా కాకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వనరుల ఉపయోగాన్ని క్షణ్ణంగా తెలుసుకోవాలి సక్రమంగా ఉపయోగించుకోవాలి ఎక్కవ కాలం తరతరాలుగా ప్రయోజనం కలిగేలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి పరిపూర్ణంగా వాడుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

తెలియని వయస్సులో నేర్చినవన్నీ తెలిసిన వయస్సులో ఫలించుట లేదు

తెలియని వయస్సులో నేర్చినవన్నీ తెలిసిన వయస్సులో ఫలించుట లేదు 
ఇంత కాలం నేర్చినదంతయు నేడు సంపూర్ణంగా ఉపయోగపడటం లేదు 

ఎన్నో కొత్త కొత్త విజ్ఞాన ప్రభావాలతో ఎన్నో నేర్చుకోవాలి ఎంతో తెలుసుకోవాలి ఎంతో అనుభవం ఉండాలి 
కొత్త కొత్త విజ్ఞానముకై ఎంతో శ్రమించాలి ఎంతో నైపుణ్యం మేధాశక్తి కలిగి ఉండాలి 
ఎల్లప్పుడూ ఉత్తేజవంతమైన ఆలోచనలతో ఎన్నింటినో గ్రహిస్తూ ప్రతీది క్షుణ్ణంగా పరిశీలిస్తూ పనిచేయాలి 

-- వివరణ ఇంకా ఉంది!

Friday, August 22, 2025

మేధస్సులోనే సర్వం పరిశుద్ధమై ఉన్నప్పుడు వాటిని మరల బహిర్గతం చేయుటలో అవసరాల విధానం ఎలా మార్పు చెందునో

మేధస్సులోనే సర్వం పరిశుద్ధమై ఉన్నప్పుడు వాటిని మరల బహిర్గతం చేయుటలో అవసరాల విధానం ఎలా మార్పు చెందునో 

మేధస్సులోని విజ్ఞానం బహిర్గతం చేసుకున్నప్పుడు మరల వాటి ప్రమేయం ప్రభావాలను తిరిగి మేధస్సులో అవసరం ఉన్న వాటినే పరిశుద్ధంగా చేర్చుకోవాలి  

మేధస్సులోని విజ్ఞానం పరిశుద్ధమైనప్పుడే హితత్వం వివిధ కార్యక్రమాలతో సాగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, August 20, 2025

ఆలోచనలు పరిశుద్ధమైతేనే మేధస్సు పరిశుద్ధమవుతుంది

ఆలోచనలు పరిశుద్ధమైతేనే మేధస్సు పరిశుద్ధమవుతుంది 
మేధస్సు పరిశుద్ధమైతేనే కార్యక్రమాలు పరిశుద్ధమవుతాయి 
కార్యక్రమాలు (ఆచరణ) పరిశుద్ధమైతేనే మానవుడు (శరీరం) పరిశుద్ధమవుతాడు 

మానవుడు పరిశుద్ధమైతేనే ఇల్లు పరిశుద్ధమవుతుంది 
ఇల్లు (గృహం) పరిశుద్ధమైతేనే వీధి పరిశుద్ధమవుతుంది 
వీధి పరిశుద్ధమైతేనే సమాజం పరిశుద్ధమవుతుంది 

సమాజం పరిశుద్ధమైతేనే గ్రామం (నగరం) పరిశుద్ధమవుతుంది 
నగరం పరిశుద్ధమైతేనే రాష్ట్రం (స్థలం) పరిశుద్ధమవుతుంది 
రాష్ట్రం పరిశుద్ధమైతేనే దేశం (ప్రాంతం) పరిశుద్ధమవుతుంది 
దేశం పరిశుద్ధమైతేనే ప్రపంచం (ప్రదేశం) పరిశుద్ధమవుతుంది 
ప్రపంచం పరిశుద్ధమైతేనే విశ్వం (బ్రంహాండం) పరిశుద్ధమవుతుంది 

మానవుడు పరిశుద్ధమైతేనే ఆహరం వస్తువులు యంత్రాలు ప్రకృతి పరిశుద్ధమవుతుంది - జీవన విధానం పరిశుద్ధంగా ఉంటుంది - ఆరోగ్యం ఆయుస్సుతో ఎక్కువ కాలం సాగుతుంది - జీవుల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి - అభివృద్ధి సాగుతుంది - సహజత్వం జీవిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!