Friday, June 5, 2015

శృతి లోని పదాలను శృతించరా

శృతి లోని పదాలను శృతించరా శివా
స్వరము లోని భావాలను స్మరించరా శివా

నీ శ్వాస లోని స్వర శృతులు స్వయంభువ శంఖములు
నీ ధ్యాస లోని స్వప్త స్వరాలు స్వయంకృత ప్రకాశములు ॥ శృతి ॥

భువి నుండి దివి వరకు ఓంకార లయ బద్ధమే
నాభి నుండి నాసికము దాక శ్వాసే ఓంకారము

ఆకార రూపాలలో అద్భుతాల అబేదమే నీ శరీరములు
ఆకృత వికృత విస్పోటన భావాలలో నీ వేద తత్వములే

విశ్వమందు నీవు నిలిచిన శివ లింగ రూపములే శిల క్షేత్రములు
కైలాసమందు నీవు లీనమైన చిత్రమే సృష్టికి భావ సుప్రభాతము  ॥ శృతి ॥

ఏ నామములో ఎక్కడ ఎలా ఉంటావో నీవే ఎరుక
నీ జీవ తత్వములు మరణములో నైనా నైతికమే

స్మశానమే దేవాలయమని తలిచే కర్త కర్మ క్రియ జీవి నీవే
అంతరంగమే ఆత్మాలయని కొలిచే ఆది పరమాత్మవు నీవే

అనంత జలచరాలకు పంచభూతాల విశ్వ శక్తి నీవే
అనంత జీవ భావాలకు ప్రతి అర్థ పరమార్థం నీవే         ॥ శృతి ॥

No comments:

Post a Comment