నీ కోసం నేనే ఉన్నా ఓ మరణమా
నా కోసం ఎవరున్నా నీవే నేస్తమా
ఎవరో ఉన్నారని తెలిసినా మరిపిస్తావుగా
ఎంతో ఉందని అనుకున్నా వదిలిస్తావుగా
లోకమంతా ప్రయాణించినా నీ వరకేగా
విశ్వమంతా చూస్తున్నా నీవే కడసారిగా
ఎక్కడికో వెళ్ళాలనుకున్నా ఏదో చేయాలనుకున్నా చివరికి నీదేగా
ఏదో ఉందనుకున్నా ఎంతో పోయిందనుకున్నా నీతో నాకు ఏదీ లేదుగా
నాదంటూ ఎవరికి వెళ్ళినా నీదంటూ అందరికి ఉంటుందిగా
నా చుట్టూ ఏదున్నా నీ చుట్టూ నాకేది ఉండదుగా
జీవించుటకు ఎవరికి ఏమిస్తావో గాని మరణించాక అందరికి ఏదీ లేదుగా
జీవితాల సుఖ దుఃఖాలు ఏవైనా మరణాల లెక్కలు శూన్యమేగా
No comments:
Post a Comment