Tuesday, February 23, 2016

అప్పుడెప్పుడో జత కలిసి ఇప్పుడిప్పుడే ఒంటరిగా మరణంతో

అప్పుడెప్పుడో జత కలిసి ఇప్పుడిప్పుడే ఒంటరిగా మరణంతో విడిపోయి ఒకరిగా జీవిస్తున్నా
అలవాటైన జత జీవితం ఒంటరి తనంతో ఆలోచనలు జ్ఞాపకాలుగా ఎక్కడికో సాగుతున్నాయి
మేధస్సులో దాగిన జ్ఞాపకాలు ఆనాటి భావాలను తెలుపుతున్నా మనస్సులో నిరాశాస్పందనయే
పలకరించే భావాలలో భేదాలు లేకున్నా మనిషిగా తలచే ఒంటరి తనమే మహా విభేదమయ్యేను
కళ్యాణంతో సాగే నూతన జత జీవితం మరణంతో సాగేను మరో నూతన ఒంటరి జీవన విధానము
ఎప్పుడు ఎవరికి ఎవరో కాలమే తెలుపునా నేడు ఉన్నవారు ఏనాటి వరకో తెలియక పోవునా
ఒంటరిగా ఉన్నా ఉన్న వారితో కలిసిపోయే జీవనమే జీవిత కాలాన్ని సాగిస్తూ మిగిలిపోయేను
జన్మించుట ఒకరి కోసం మరణించుట మన కోసమే నని మనకు తెలిసి తెలియక పోవునేమో

No comments:

Post a Comment