Tuesday, February 16, 2016

ఆత్మనై వచ్చాను ఈ జగతికి - జీవమై ఉన్నాను ఈ లోకానికి

ఆత్మనై వచ్చాను ఈ జగతికి - జీవమై ఉన్నాను ఈ లోకానికి
విశ్వమై ఉంటాను ఈ కాలానికి  - దైవమై ఉన్నాను ఈ సృష్టికి
పంచ భూతమై నిలిచాను ఈ ప్రకృతిలో - పరమాత్మలా జీవిస్తున్నాను ప్రతి అణువులో ॥

శ్వాసలో ధ్యాసనై మరణం వరకు ఉచ్చ్వాస నిచ్చ్వాస లతో జీవమై జీవిస్తున్నా
మేధస్సులో భావమై ఆలోచనలతో కార్యమై అజ్ఞాన విజ్ఞానాలతో సాగుతున్నా

ప్రపంచమే పరమావధిగా అంతరిక్షమే బ్రంహాన్డముగా విశ్వ పరంపరలలో దాగి ఉన్నా
ఆకాశమే విజ్ఞాన క్షేత్రంగా సముద్రమే విజ్ఞాన కెరటంగా అలల మేఘాలతో సాగుతున్నా

సుమదుర భావాల సువర్ణాలలో ఆకార రూపాల ఆభరణాలలో గుణ లక్షణమై ఒదిగున్నా
అమృత స్వరాల స్వప్నములలో గంధర్వపు గాలుల సవ్వడులలో హాయిగా నిద్రిస్తున్నా ॥

సూర్యుడినై విశ్వమంతా ప్రకాశిస్తూ జీవ బంధాలకు తేజమునై తరతరాలుగా సాగుతున్నా
చంద్రుడినై చీకటికి కాంతి వెన్నెలగా నక్షత్ర కూటమిలో మూల కేంద్రమై ఆకాశాన్ని వీక్షిస్తున్నా

భూగోళానికే గురుత్వాకర్షణ నై భూ మండలానికే విశ్వ విఖ్యాత కీర్తి ప్రతిభనై నే ఉన్నా
విశ్వ దేశాలకు అధిపతినై కాల భావాలకు ప్రత్యక్షమై కాల ప్రభావాలకు అతిధినై ఉన్నా

జీవించుటలో సర్వము నేనై ధ్యానించుటలో సమస్తము నేనై జగతికి ప్రతి రూపమై ఉన్నా
అనంత రూపాలలో అణువులనై ఆఖండ దేశాలలో ఆశ్చర్యమై విజ్ఞాన పరిశోధన చేస్తున్నా ॥  

No comments:

Post a Comment