Wednesday, January 17, 2018

గుర్తించలేదా విశ్వ కవిని గమనించలేదా తెలుగు కవిని

గుర్తించలేదా విశ్వ కవిని గమనించలేదా తెలుగు కవిని
స్మరించలేదా జీవ కవిని పలికించలేదా తెలుగు కవిత్వాన్ని

నీయందే ఉన్నది విశ్వ కవి గీతం నీలోనే ఉన్నది తెలుగు కవి గానం
నీతోనే ఉన్నది విశ్వ కవి భావనం నీలోనే ఉన్నది తెలుగు కవి గాత్రం  || గుర్తించలేదా ||

మరచిపోలేని జ్ఞాపకాల కవిత్వాలు విజ్ఞానమే తెలిపేను నిత్యం
మరణింపలేని వేదాల కవిత్వాలు ప్రజ్ఞానమే తెలిపేను సర్వం

తెలుగు కవి విజ్ఞాన భావాలలో వేదాల వేదాంతం మహా గమన సిద్ధాంతం
తెలుగు కవి ప్రజ్ఞాన తత్వాలలో భావాల అనుభవం మహా స్మరణ శాస్త్రీయం  || గుర్తించలేదా ||

తెలుగు బంధాలకు తేనీయ వచనమే విజ్ఞాన పరిశోధనం
తెలుగు స్నేహాలకు తెలుపు రచనమే ప్రజ్ఞాన అన్వేషణం

తెలుగు భావాలకే తెలిసేను కవి చిత్ర వర్ణన రూప సౌందర్య సుగంధం
తెలుగు తత్వాలకే తెలిసేను కవి మిత్ర గమన జీవ సౌభాగ్య సుందరం  || గుర్తించలేదా ||

No comments:

Post a Comment