Thursday, September 6, 2018

ఎదిగినా ఒదిగిన రూపమే అమ్మ

ఎదిగినా ఒదిగిన రూపమే అమ్మ
తలచినా కలిగిన రూపమే అమ్మ

మలిచినా వలచిన రూపమే అమ్మ
పలికినా పిలిచిన రూపమే అమ్మ

ఏ రూపమై నిలిచినా తన రూపమే అమ్మ
ఏ భావమై చూసినా తన బంధమే అమ్మ    || ఎదిగినా ||

ఆకాశమై అవతరించిన సూర్యోదయమే అమ్మగా వెలిసిన అమృత తేజం
ఆలయమై ఆవరించిన ఆనందమయమే అమ్మగా తలచిన ఆద్యంత శిల్పం

నీడగా నడిపిస్తూనే వేదాన్ని పలికిస్తూ అన్వేషించే తపనమే అమ్మ ఆచరణం
జాడగా సాగిస్తూనే ధర్మాన్ని బోధిస్తూ వివరించే విజ్ఞానమే అమ్మ ఆకాంక్షణీయం   || ఎదిగినా ||

గమ్యాన్ని చేరుకొనుటకు సహనంతో సాధనం చేసే సాహసమే అమ్మ ఒక శౌర్యం
లక్ష్యాన్ని గ్రహించుటకు మేధస్సుతో ఉపాయం చేసే సామర్థ్యమే అమ్మ ఒక వీర్యం

బంధాలను సాగిస్తూనే రూపాలను సృష్టిస్తూనే నిలిచినది అమ్మ స్వరూపం
కార్యాలను నడిపిస్తూనే రూపాలను కల్పిస్తూనే వెలిసినది అమ్మ సౌభాగ్యం   || ఎదిగినా || 

No comments:

Post a Comment