Friday, November 30, 2018

నా దేహములోనే అనంత జీవములు జీవిస్తున్నాయి

నా దేహములోనే అనంత జీవములు జీవిస్తున్నాయి
నా మేధస్సులోనే సర్వాంత జీవములు ఉదయిస్తున్నాయి

నా రూపములోనే సకల జీవరాసులు నిర్మితమైనాయి
నా ఆకారములోనే సకల జీవరాసులు నిర్ణీతమైనాయి   || నా దేహములోనే ||

జీవములన్నీ ఒకటేనని దేహములోనే జీవమై జీవిస్తున్నాయి
దేహములన్నీ ఒకటేనని మేధస్సులోనే జ్ఞానమై ఉదయిస్తున్నాయి

రూపాల ఆకారాలలోనే అనంత భావాలు నిర్మితమై ఉన్నాయి
సుగంధాల వర్ణాలలోనే సర్వాంతర తత్వాలు నిర్ణీతమై ఉన్నాయి  || నా దేహములోనే ||

ఆత్మ పరమాత్మలోనే పరిశోధన ప్రభావాలు పరిశీలనమై ఉన్నాయి
జ్యోతి పరంజ్యోతిలోనే పరిపూర్ణ ప్రాకారాలు పరిశుద్ధనమై ఉన్నాయి

జ్ఞాన విజ్ఞానములోనే ప్రజ్ఞాన ప్రబంధకాలు పరిజ్ఞానమై ఉన్నాయి
శాస్త్ర సిద్ధాంతములోనే శాస్త్రీయ పరిష్కారాలు సృస్టీకరణమై ఉన్నాయి  || నా దేహములోనే || 

ఎందరో మరెందరో మహాత్ములు ఉదయించారు

ఎందరో మరెందరో మహాత్ములు ఉదయించారు
ఎందరో మరెందరో మహానుభావులు ఉద్యమించారు

ఎందరు మరెందరో మహర్షులు అవతరించారు
ఎందరో మరెందరో మహనీయులు అధిరోహించారు

ఇంకా ఎందరో మరెందరో జీవిస్తూనే ఉన్నారు
ఇంకా ఎందరో మరెందరో జన్మిస్తూనే ఉంటారు   || ఎందరో  ||

మనిషిగా ఎదిగిన వారే మరో మనిషిగా మహోన్నతమై సాగుతారు
మనిషిగా ఒదిగిన వారే మరో మనిషిగా మహోజ్వలమై వెలుగుతారు

ఋషిగా మహా ఋషిగా జీవించే వారే దైవర్షిగా అవతరించెదరు
ఋషిగా మహా ఋషిగా జన్మించే వారే బ్రంహర్షిగా అధిరోహించెదరు  || ఎందరో  ||

మనిషిగా మరో మనిషిని చూసేవారు మహోత్తరమై సాగెదరు
మనిషిగా మరో మనిషిని తలిచేవారు మహాతత్వమై నిలిచెదరు

ఆత్మగా మరో ఆత్మను దర్శించేవారే మహాత్మగా ఉదయించెదరు
ఆత్మగా మరో ఆత్మను ఆదరించేవారే మహతిగా ఉద్యమించెదరు  || ఎందరో  || 

Thursday, November 29, 2018

ఏనాటిదో దివ్య కమలం

ఏనాటిదో దివ్య కమలం 
ఎంతటిదో దివ్య మధురం

మేధస్సుకే మోహన రూపం
మనస్సుకే మధుర స్వప్నం

విశ్వానికే ఆనంద జీవం
దేహానికే సుగుణ తత్వం   || ఏనాటిదో ||

భావాలతో సాగే బంధం
వేదాలతో సాగే విజ్ఞానం 

కన్నులతో కలిగే కార్యం
కాలంతో కలిగే సమయం

రాగాలతో వెలిగే రత్నం
గానాలతో వెలిగే గాత్రం   || ఏనాటిదో ||

పాదాలతో సాగే గమ్యం
దేహాలతో సాగే రమ్యం

వయస్సుతో కలిగే చిత్రం
ఆయుస్సుతో కలిగే చైత్రం

గంధాలతో వెలిగే వర్ణం
బంధాలతో వెలిగే చూర్ణం   || ఏనాటిదో ||

Friday, November 23, 2018

నా మేధస్సులోనే ఏమున్నదో

నా మేధస్సులోనే ఏమున్నదో
నా ఆలోచనలోనే ఏమున్నదో

మేధస్సులోనే సర్వం ఆలోచిస్తున్నది
మేధస్సులోనే నిత్యం ఆలోచిస్తున్నది

మేధస్సు ఎంతటిదో భావాల ఆలోచనలను ఊటగా ఊరిస్తున్నది  || నా మేధస్సులోనే ||

మేధస్సులోని భావాలతోనే ఆలోచిస్తున్నా
మేధస్సులోని తత్వాలతోనే ఆలోచిస్తున్నా

మేధస్సులోని కణాలతోనే ఆలోచిస్తున్నా
మేధస్సులోని గుణాలతోనే ఆలోచిస్తున్నా

మేధస్సే మధురం మధురం మహా మధురం
మధురాతి మధురాల మహా మధుర అతిశయం  || నా మేధస్సులోనే ||

మేధస్సులోనే ప్రతి కార్యం ఆలోచిస్తున్నా
మేధస్సులోనే ప్రతి జ్ఞానం ఆలోచిస్తున్నా

మేధస్సులోనే ప్రతి గమనం ఆలోచిస్తున్నా
మేధస్సులోనే ప్రతి చలనం ఆలోచిస్తున్నా

మేధస్సే మధురం మధురం మహా మధురం
మధురాతి మధురాల మహా మధుర మకరందం  || నా మేధస్సులోనే ||   

Thursday, November 22, 2018

నా జీవితం ఎంతో విచిత్రం

నా జీవితం ఎంతో విచిత్రం
నా జీవనం ఎంతో విభిన్నం

నా కార్య కాలం కర్కాటకం
నా జీవ భావం భాస్వాంతకం

నా జ్ఞాన వేదం విశ్వాంతకం
నా రూప తత్వం సర్వాంతకం  || నా జీవితం ||

కార్యాలతో సాగే నా సమన్వయం సహచర భావాల సందర్భం
వేదాలతో సాగే నా మన్వంతరం సహకార తత్వాల శుభంకరం

రూపాలతో సాగే నా రూపాంతరం పరోపకార పరహితత్వం
ఆకారాలతో సాగే నా ఆద్యంతరం సర్వోపకార పరగుణత్వం  || నా జీవితం ||

కాలంతో సాగే నా కార్య చలనం సమాంతర వేదాల సుపరిచితం
భావాలతో సాగే నా కాల గమనం విశ్వాంతర గుణాల సులేఖనం

గంధాలతో సాగే నా రూప దర్శనం పుష్పాంతర గాలుల సౌగంధ్యం
వర్ణాలతో సాగే నా జీవ దర్పణం సర్వాంతర మేఘాల వసంతర్యం   || నా జీవితం || 

ఓం నమో సూర్య వర్ణ విజ్ఞేశ్వరాయనమః

ఓం నమో సూర్య వర్ణ విజ్ఞేశ్వరాయనమః
ఓం నమో సూర్య దేశ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య జీవ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య జన విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య దైవ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య తేజ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య లోక విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య చక్ర విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య భావ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య జ్ఞాన విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య గుణ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య దేహ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య కార్య విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య గ్రహ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య క్షేత్ర విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య ధర్మ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య పూర్ణ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య చిత్ర విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య రూప విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య క్రియ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య జ్యోతి విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య తత్వ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య ధ్యాన విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య కాంత విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య కేంద్ర విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య స్పర్శ విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య చంద్ర విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో సూర్య ప్రాంత విజ్ఞేశ్వరాయ నమః 

Saturday, November 17, 2018

కనిపించదు కలలకు దూరం

కనిపించదు కలలకు దూరం
వినిపించదు ఊహలకు శబ్దం

మరణించదు మనస్సుకు మౌనం
జన్మించదు వయస్సుకు స్వప్నం

జీవించుటలో తెలియదు ఎవరికి కథనం
ఎదుగుటలో తోచదు ఎందరికో నిపుణం   || కనిపించదు ||

ప్రతిబింబం కనిపించని విధమే
పరస్పరం అన్పించని బంధమే

అతిశయం దొరికినా అల్పమే
పరిణయం గడిచినా లోపమే   || కనిపించదు ||

సమయం ఊహించినా కల్పితమే
ప్రయాణం ఊరించినా ఉద్రేకమే

మోహనం బంధాలకు నయనమే
సోయగం మెరుపులకు ఆ'భరణమే   || కనిపించదు || 

ఆభరణం ధరించవా శంకరా ... !

ఆభరణం ధరించవా శంకరా ... !
ఆభరణం వరించవా శంకరా ... !

ఆభరణం లేని భరణం నటనకు మరణం
ఆభరణం లేని భరణం నటులకు చరణం

నీ ఆభరణమే నటనకు ఓంకార శంకరాభరణం
నీ ఆదరణమే నటులకు శ్రీకార శంకరాభరణం  || ఆభరణం ||

నీవు భరించిన భావాలే విశ్వానికి ఆభరణం
నీవు త్యజించిన తత్వాలే జగతికి ఆభరణం

నీవు ధరించిన ఆభరణమే శంకరాభరణం
నీవు వరించిన ఆభరణమే శంకరాభరణం  || ఆభరణం ||

నీవు పలికిన శృతులే సంగీత సాహిత్య భరణాల శంకరాభరణం
నీవు తలిచిన స్వరాలే సంగీత పాండిత్య భరణాల శంకరాభరణం

నీవు గమనించిన గమకాలే లోకానికి ఆభరణాల శంకరాభరణం
నీవు రచించిన రచనాలే కైలాసానికి ఆభరణాల శంకరాభరణం  || ఆభరణం ||