Friday, July 30, 2021

నన్నే అన్వేషించవా నన్నే పరిశోధించవా

నన్నే అన్వేషించవా నన్నే పరిశోధించవా 
నన్నే పర్వేషించవా నన్నే సంశోధించవా 

నన్నే పరీక్షించవా నన్నే సమీక్షించవా
నన్నే విజ్ఞానించవా నన్నే ప్రజ్ఞానించవా 
 
నన్నే ఆశ్రయించవా నన్నే ఆత్రయించవా
నన్నే సమీకరించవా నన్నే అనుసరించవా

నన్నే సందర్శించవా నన్నే సంభాషించవా 
నన్నే పరామర్శించవా నన్నే సంబోధించవా

నన్నే తిలకించవా నన్నే భావించవా 
నన్నే స్మరించవా నన్నే ధ్యానించవా 

నన్నే గుర్తించవా నన్నే కీర్తించవా 
నన్నే అర్థించవా నన్నే ప్రార్థించవా 

నన్నే వీక్షించవా నన్నే రక్షించవా 
నన్నే శాంతించవా నన్నే కాంతించవా 
 
నన్నే వినిపించవా నన్నే పలికించవా 
నన్నే సూచించవా నన్నే యోచించవా

నన్నే జళిపించవా నన్నే గెలిపించవా 
నన్నే తెలిపించవా నన్నే సలిపించవా

క్షమించేవారు శిక్షించలేరు

క్షమించేవారు శిక్షించలేరు 
శిక్షించేవారు క్షమించలేరు 

శ్రమించేవారు ఆశించలేరు 
ఆశించేవారు శ్రమించలేరు 

రక్షించేవారు హింసించలేరు 
హింసించేవారు రక్షించలేరు 

నడిచేవారు ఆగలేరు 
ఆగేవారు నడవలేరు 

ప్రేమించేవారు ద్వేషించలేరు 
ద్వేషించేవారు ప్రేమించలేరు 

గౌరవించేవారు అవమానించలేరు 
అవమానించేవారు గౌరవించలేరు 

కలసిపోయేవారు విడిచిపోలేరు 
విడిచిపోయేవారు కలసిపోలేరు  

ఒదిగేవారు ఎదగలేరు 
ఎదిగేవారు ఒదగలేరు

ఇచ్చేవారు అడిగించుకోలేరు 
అడిగించుకునేవారు ఇవ్వలేరు 

మార్చుకునేవారు దాచుకోలేరు 
దాచుకునేవారు మార్చుకోలేరు 

పరిశోధించేవారు అజ్ఞానులుకారు 
అజ్ఞానులు పరిశోధించేవారుకారు

సరియైనవారు సరిపోకపోరు 
సరిపోనివారు సరయైపోరు 

గుణవంతులు చెప్పకునేవారుకారు  
చెప్పకునేవారు గుణవంతులుకారు

నడిపించేవారు ఆపలేరు 
ఆపేవారు నడిపించలేరు