క్షమించేవారు శిక్షించలేరు
శిక్షించేవారు క్షమించలేరు
శ్రమించేవారు ఆశించలేరు
ఆశించేవారు శ్రమించలేరు
రక్షించేవారు హింసించలేరు
హింసించేవారు రక్షించలేరు
నడిచేవారు ఆగలేరు
ఆగేవారు నడవలేరు
ప్రేమించేవారు ద్వేషించలేరు
ద్వేషించేవారు ప్రేమించలేరు
గౌరవించేవారు అవమానించలేరు
అవమానించేవారు గౌరవించలేరు
కలసిపోయేవారు విడిచిపోలేరు
విడిచిపోయేవారు కలసిపోలేరు
ఒదిగేవారు ఎదగలేరు
ఎదిగేవారు ఒదగలేరు
ఇచ్చేవారు అడిగించుకోలేరు
అడిగించుకునేవారు ఇవ్వలేరు
మార్చుకునేవారు దాచుకోలేరు
దాచుకునేవారు మార్చుకోలేరు
పరిశోధించేవారు అజ్ఞానులుకారు
అజ్ఞానులు పరిశోధించేవారుకారు
సరియైనవారు సరిపోకపోరు
సరిపోనివారు సరయైపోరు
గుణవంతులు చెప్పకునేవారుకారు
చెప్పకునేవారు గుణవంతులుకారు
నడిపించేవారు ఆపలేరు
ఆపేవారు నడిపించలేరు
No comments:
Post a Comment