Tuesday, November 23, 2021

నేనెవరినో ఎవరికి తెలియదా ఓ విశ్వమా

నేనెవరినో ఎవరికి తెలియదా ఓ విశ్వమా 
నేనెవరినో ఎవరికి తెలియదా ఓ లోకమా 

నేనెవరినో ఎవరికి తెలియదా ఓ వేదమా 
నేనెవరినో ఎవరికి తెలియదా ఓ జ్ఞానమా 

నేనెవరినో తెలిసేలా శ్రమించిన కార్యానికే తెలియును కాలమా 
నేనెవరినో తెలిసేలా స్తంభించిన రాజ్యానికే తెలియును కాలమా 

ఎవరికీ తెలియకున్నా నాలో నేనే నాకై నేనే భావమై జీవిస్తున్నా 
ఎవరికీ తెలియకున్నా నాలో నేనే నాకై నేనే తత్త్వమై ధ్యానిస్తున్నా 

విశ్వ భాషలందు తెలుగు తేనీయం

విశ్వ భాషలందు తెలుగు తేనీయం 
దివ్య భాషలందు తెలుగు తామరం 

వేద భాషలందు తెలుగు తటస్థం 
రాజ్య భాషలందు తెలుగు తపనం 

శాస్త్ర భాషలందు తెలుగు తోరణం 
బహు భాషలందు తెలుగు తరుణం 

భావ భాషలందు తెలుగు తగరం 
తత్త్వ భాషలందు తెలుగు తీరతం 

విద్య భాషలందు తెలుగు త్రిగుణం 
పూర్వ భాషలందు తెలుగు తపస్యం 

విశ్వమే పలుకుతుంది వేదం

విశ్వమే పలుకుతుంది వేదం 
లోకమే తెలుపుతుంది జ్ఞానం 

జగమే అడుగుతుంది నాదం 
జీవమే కలుగుతుంది రూపం 

శ్వాసయే ఎదుగుతుంది కాలం 
ధ్యాసయే ఒదుగుతుంది కార్యం 

భావమే బహు విధాలుగా బంధాలతో రాజ్యమై సాగుతున్నది 
తత్త్వమే మహా వైనాలుగా శాంతాలతో పూజ్యమై వెళ్ళుతున్నది  

Thursday, November 4, 2021

విశాలమైన విశ్వంలో మనం కొంత కాలమే

విశాలమైన విశ్వంలో మనం కొంత కాలమే 
విచిత్రమైన లోకంలో మనం కొంత కాలమే 

జీవిస్తున్నా సాధిస్తున్నా విహరిస్తున్నా విశ్వసిస్తున్నా కొంత కాలమే 
శ్రమిస్తున్నా స్మరిస్తున్నా ప్రయాణిస్తున్నా ప్రవహిస్తున్నా కొంత కాలమే 

కాలమంతా సమయంలో ప్రేమించేవారు స్నేహించేవారు కొంత కాలమే 
కాలమంతా తరుణంలో సందర్శించేవారు స్పందించేవారు కొంత కాలమే  || విశాలమైన || 

కాలంతోనే మన విధానం కాలంతోనే మన ప్రధానం 
కాలంతోనే మన చలనం కాలంతోనే మన ప్రమేయం 

కాలంతోనే మన ప్రయాణం కాలంతోనే మన ప్రయత్నం 
కాలంతోనే మన ప్రభాషణం కాలంతోనే మన ప్రభాసితం 

కాలంతోనే మన విజ్ఞానం కాలంతోనే మన విఖ్యాతం  
కాలంతోనే మన వినయం కాలంతోనే మన విధేయం    

ఆలోచించే మేధస్సులతోనే మన మన కాలానికి నిర్మాణం 
ఆలోచించే మేధస్సులతోనే మన మన కాలానికి విచ్ఛిన్నం   || విశాలమైన || 

కాలంతోనే మన విజయం కాలంతోనే మన విఫలం 
కాలంతోనే మన విశుద్ధం కాలంతోనే మన వికృతం 
 
కాలంతోనే మన ప్రభాతం కాలంతోనే మన ప్రణామం 
కాలంతోనే మన ప్రపంచం కాలంతోనే మన ప్రశాంతం

పరిశోధించే మేధస్సులతోనే మన మన కాలానికి ఔషధం   
పరిశోధించే మేధస్సులతోనే మన మన కాలానికి విషమం