విశాలమైన విశ్వంలో మనం కొంత కాలమే
విచిత్రమైన లోకంలో మనం కొంత కాలమే
జీవిస్తున్నా సాధిస్తున్నా విహరిస్తున్నా విశ్వసిస్తున్నా కొంత కాలమే
శ్రమిస్తున్నా స్మరిస్తున్నా ప్రయాణిస్తున్నా ప్రవహిస్తున్నా కొంత కాలమే
కాలమంతా సమయంలో ప్రేమించేవారు స్నేహించేవారు కొంత కాలమే
కాలమంతా తరుణంలో సందర్శించేవారు స్పందించేవారు కొంత కాలమే || విశాలమైన ||
కాలంతోనే మన విధానం కాలంతోనే మన ప్రధానం
కాలంతోనే మన చలనం కాలంతోనే మన ప్రమేయం
కాలంతోనే మన ప్రయాణం కాలంతోనే మన ప్రయత్నం
కాలంతోనే మన ప్రభాషణం కాలంతోనే మన ప్రభాసితం
కాలంతోనే మన విజ్ఞానం కాలంతోనే మన విఖ్యాతం
కాలంతోనే మన వినయం కాలంతోనే మన విధేయం
ఆలోచించే మేధస్సులతోనే మన మన కాలానికి నిర్మాణం
ఆలోచించే మేధస్సులతోనే మన మన కాలానికి విచ్ఛిన్నం || విశాలమైన ||
కాలంతోనే మన విజయం కాలంతోనే మన విఫలం
కాలంతోనే మన విశుద్ధం కాలంతోనే మన వికృతం
కాలంతోనే మన ప్రభాతం కాలంతోనే మన ప్రణామం
కాలంతోనే మన ప్రపంచం కాలంతోనే మన ప్రశాంతం
పరిశోధించే మేధస్సులతోనే మన మన కాలానికి ఔషధం
పరిశోధించే మేధస్సులతోనే మన మన కాలానికి విషమం
No comments:
Post a Comment