మరణించే మందిరం శరీరమేగా
ఉదయించే మందిరం శరీరమేగా
అమృతమై జీవించే మందిరం శరీరమేగా
ఆరోగ్యమై ధ్యానించే మందిరం శరీరమేగా
మరణమే లేని అమృతం ఆరోగ్యమై జీవించే మందిరమేగా
మరణమే లేని మందిరం అమృతమై ధ్యానించే శరీరమేగా || మరణించే ||
అమృత్వంలో దాగిన విశ్వ పోషకాలు జీవ భావాల దైవ తత్త్వాలేగా
మాతృత్వంలో దాగిన జీవ పోషకాలు విశ్వ భావాల దేహ తత్త్వాలేగా
అమృత్వంలో ఒదిగిన సర్వ పదార్థాలు జీవ కణాల దైవ పోషకాలేగా
మాతృత్వంలో ఒదిగిన జీవ పదార్థాలు సర్వ కణాల దేహ పోషకాలేగా
మందిరంలో ఎదిగిన అమృత్వ పోషకాలు మరణమే లేని జీవ కణాలేగా
మందిరంలో ఎదిగిన మాతృత్వ పదార్థాలు మరణమేలేని దేహ కణాలేగా || మరణించే ||
No comments:
Post a Comment