విజయం లేనివారు ఎన్నో విధాల జీవిస్తూనే ఉంటారు
విజయం కలవారు ఒకే విధంలో ప్రయాణిస్తూ ఉంటారు (ఎదుగుదల వైపుతో సాగుతుంటారు)
విజయం గెలుపుకు మొదటి స్థానమైతే ఒకరికే లభిస్తుంది మిగిలిన స్థానాలన్నీ మనందరివే
మనమందరం కష్టపడితే ఒకరికే విజయం లభిస్తుంది - లోకం విజయాన్నే చూస్తూ సాగుతుంది
అందరికి లభించే విజయం ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మం సంతోషం సాగుతుంది
అందరికి లభించే విజయం ఎక్కడ ఉంటుందో అక్కడ మొదటి స్థానం ఉండదు సమానవత్వమే ఉంటుంది
విజయం కలవారు విజయం లేనివారిని ఆదుకున్నప్పుడే సమానత్వం సంపూర్ణ విజయం లభిస్తుంది
లోకం సంపూర్ణ విజయాన్ని తెలుసుకుంటే దైవం ధర్మం త్యాగం సమానత్వంతో విశ్వమంతా ప్రశాంతం
ఆత్మ జ్ఞానం కలవారు సంపూర్ణ విజయాన్ని ఆలోచిస్తూ సాగుతుంటారు కానీ అవకాశం లభించదు
ఆత్మ జ్ఞానం కలవారు సంపూర్ణ విజయం కోసం ఎంతో కాలంగా జీవిస్తూ ఆలోచిస్తూ దేహాన్ని వదిలి వెళ్ళిపోతారు