Friday, May 23, 2025

మేధస్సులో సర్వాంతర విశ్వ విజ్ఞానం కలిగివున్నా సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అజ్ఞానంతోనే సాగుతున్నాయి

మేధస్సులో సర్వాంతర విశ్వ విజ్ఞానం కలిగివున్నా సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అజ్ఞానంతోనే సాగుతున్నాయి  

ఉదాహరణ: ఆరోగ్య బీమా తంత్ర విధానాలతో ఎందరో ఎన్నో రకాలుగా మోసపోతున్నారు 

తల్లి తండ్రులకు ఒక బీమా, కుటుంబానికి [కుటుంబం : ఉద్యోగి/కార్మికుడు, భార్య, పిల్లలు] ఒక బీమా వేరు వేరుగా బీమాకిస్తీలతో ధనాన్ని దోచుకుంటున్నారు 

కుటుంబం అంటే తల్లి తండ్రులు, భార్య/భర్త, పిల్లలు [ఒకే బీమా]

కొన్ని [కంటిపొర శస్త్ర వైద్యము/వ్రణ చికిత్స] బీమా తంత్ర విధానాలకు పునరుద్ధరణ [రెండు సంవత్సరాలు] బీమాకిస్తీని చెలిస్తేనే అర్హత కలుగుతుందంటా 

రెండు సంవత్సరాల బీమాకిస్తీ కడితే నాకు వచ్చేది కట్టిన దానికంటే తక్కువ అలాంటప్పుడు ఎందుకు రెండు సంవత్సరాల బీమాకిస్తీలను కట్టాలి 

ఒక బీమాకిస్తీని కట్టిన ద్వారా వచ్చే రుసుమే కాస్త/అల్పంగా అదనంగా వస్తుంది [రెండు సార్లు కడితే నష్టం వస్తుంది]
 
అవసరానికి అగత్యానికి చేయుంచుకున్న శస్త్రవైద్యంతో ఒక సారి కట్టే బీమాకిస్తీయే అర్హత కలిగించాలి 

ఇలాంటి వాటిని ఎవర పట్టించుకుంటారు ఎలా అదుపులోకి పేద ప్రజలకై అమలుపరుస్తారు [ఒక సంవత్సరం కట్టే బీమాకిస్తీయే అర్హతగా కంటిపొర శస్త్రచికిత్సకు కలగాలి - ఇలా ఏ బీమా కైనా వర్తించాలి] 

పునరుద్ధరణ ఉంటేనే అర్హత అనే బీమాను చట్టబద్ధంగా న్యాయంగా నీతి స్వరూపంగా తొలగించాలి 

మనిషి నిరంతరం శ్రమించి తన సంపాదనను వసతులకు సౌకర్యాలకు పిల్లల చదువులకు ఖర్చు చేయకుండా ఆరోగ్యం కోసం చేసేదే బీమా - దీని నుండి కూడా మోసపోతే సహాయం కలగకపోతే కుటుంబం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది విజ్ఞాన సమాజం ఎప్పుడు కనబడుతుంది జీవితంలో ఆశయాలు ఎప్పుడు ఉద్భవిస్తాయి దేశం ఎప్పుడు ముందుకు సాగుతుంది 

ఇలా ఎన్నో వివరించగలను 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment