Thursday, May 29, 2025

యుద్ధంలో పోరాటం చేయకున్నను శత్రువులకు ఎదురుగా ధైర్యంగా నిలిచి ఉండడమే విజయం

యుద్ధంలో పోరాటం చేయకున్నను శత్రువులకు ఎదురుగా ధైర్యంగా నిలిచి ఉండడమే విజయం వీరుని లక్షణం  

యుద్ధంలో ఎందరున్నా ఎదురుగా నిలిచి ధైర్యంగా ముందుకు సాగిపోయేవాడే వీరుడు 

యుద్ధాన్ని ఆపగలిగేవాడు కూడా వీరుడు అపారమైన అనుభవ ప్రజ్ఞానుడు ప్రశాంత రూపుడు ధైర్యవంతుడు 

ధైర్యం పోరాటానికే కాదు ప్రశాంతతకు కూడా చాలా అవసరం 

ఇద్దరు వ్యక్తుల మధ్య పొందిక లేకున్నా ఇరువురు ప్రాంతాలవారి మధ్య పొందిక లేకున్నా పోరాటాలు ఏర్పడుతాయి 
పోరాటాలు అధికమైతే యుద్దాలు అవతరిస్తాయి ఆయుధాలు సృష్టించబడుతాయి ప్రాణ నష్టాలు జరిగిపోతాయి 

ఇద్దరు వ్యక్తుల మధ్యగాని ఇరువురి ప్రాంతాలవారి మధ్యగాని అనుభవమైన విజ్ఞానం అపూర్వమైన ప్రశాంతత సుద్దీర్ఘ కాలపు హిత స్నేహితం శాంతి తత్వం ఉండాలి తరతరాలుగా అర్థం చేసుకుంటూ అనుభవాలతో ఆరోగ్యంతో ప్రకృతి అభివృద్ధితో సాగిపోవాలి 

ఆయుధాలు కార్యాలకు [యంత్రాలకు] పనిముట్లుగా ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రాణాలకు హాని కలిగించరాదు 

హాని కలిగించే ఆయుధాలు అజ్ఞానవంతమైనవి జీవించుటకు ప్రయోజనం లేనివి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment