ఏనాటిదో ఏనాటికో తెలియని భావనతో జన్మించావు
ఏనాటిదో ఏనాటికో తెలియని జీవితాన్ని సాగిస్తున్నావు
ఎంతవరకు జీవం ఉంటుందో ఎప్పటివరకు జీవితం సాగుతుందో
కాల భావనకు తెలిసినట్లుగా మేధస్సుకు తెలియకపోతున్నది ||
విశ్వంలో నీ రూపం ఉన్నట్లు మరో రూపం లేకనే జన్మించావా
జగతిలో నీ విజ్ఞానం ఉన్నట్లు మరో జీవికి లేకనే జన్మించావా
ఏ జీవికి లేని రూప విజ్ఞానం నీకే ఉందని విశ్వమంతా తెలిసిందా
విశ్వమంతా నీ విజ్ఞానమే తెలిసేలా మహా విజ్ఞానంతో జీవిస్తున్నావా ||
అన్వేషణతో సాగే నీ మేధస్సుకు విశ్వమే విజ్ఞానమై నీలో ఉన్నది
భావనతో సాగే నీలో ఆలోచనకు విశ్వమే జీవమై నీతో జీవిస్తున్నది
వేదమే విజ్ఞానంగా నీ జీవితానికి కాలమే దారి చూపుతున్నది
మౌనమే శ్రద్ధగా నీ మేధస్సుకు కాలమే పరమార్థాన్ని తెలుపుతున్నది ||
విచక్షణతో ఆలోచించే నీ మేధస్సులో భావన ఓ మూల కారణం
విశ్వార్థ విచక్షణను గ్రహించే నీ మేధస్సులో ఆలోచన పరమార్థం
మనస్సును మేధస్సుతో కేంద్రీకరించి ఆలోచనను విజ్ఞానపరుస్తున్నావు
భావాన్ని జీవంతో కేంద్రీకరించి ఆలోచనను అర్థంగా మారుస్తున్నావు ||
మరణం నీ వయసుకు తెలుస్తున్నది కాలం నీ జీవితాన్ని సాగిస్తున్నది
నీ మేధస్సు విధానం కాలమే నిర్ణయించినా విజ్ఞానాన్ని నీవే నిర్ణయించుకో
ఆలోచనలతో జీవితాన్ని గ్రహిస్తూ మరణించే వరకు విజ్ఞానంగా ప్రయాణించు
కాలంతో సాగిపోతూనే అందరితో సాగిపోతూ ఎందరితో తెలుస్తుంది మరణం ||
No comments:
Post a Comment