విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా
విశ్వమే ఆగేలా ఉందిరా ఓ కాలమా!
కాల భావన లేని విశ్వం మహా ప్రళయమే
మౌనంతో నిలిచే విశ్వం కాలానికే నిరంకుశం ||
సాగించరా విశ్వాన్ని నా భావాలతో యుగాలుగా
మేధస్సులో ఉన్నాయి యుగాల భావాలు ఎన్నో
అనంతమై విశ్వ కాలంతో సాగేలా ఉద్భవిస్తున్నాయి
ఆశ్చర్యమైనా అద్భుతంగా సాగేలా కలుగుతున్నాయి
ప్రతి జీవికి పునరుద్ధారణ శక్తి కలిగేలా మళ్ళీ సూర్యోదయం
మళ్ళీ మహోదయ విశ్వ భావాలతో సకల జీవరాసులు జీవిస్తాయి
అనంతర శక్తి భావాలు ఉద్భవిస్తూ విశ్వమే సాగిపోతుంది
కాల భావాలు విశ్వంతో ఏకమై యుగాలుగా సాగిపోతాయి
విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా
విశ్వమే ఆగేలా ఉందిరా ఓ కాలమా!
కాల భావన లేని విశ్వం మహా ప్రళయమే
మౌనంతో నిలిచే విశ్వం కాలానికే నిరంకుశం ||
జీవించు విశ్వానికి తోడుగా మహా మిత్రుడిగా
కాలాన్ని సాగించు జీవిగా మహా మేధావిగా
విశ్వమంతా నీ భావన విజ్ఞానమే సాగుతున్నది
విశ్వానికి నీ కాల భావాలే సాగిపోతున్నాయి
విశ్వానికి నీ భావనతో స్పర్శ కలుగుతున్నది
నీవు లేని విశ్వం మౌనమైనా మహా ప్రళయమే
నీలోని శాంతి తత్వం విశ్వానికి మహా చైతన్యం
నీలోని జీవం కాలానికే మహా గుణ శక్తి యోగం
విశ్వమే నీకు తెలుపుతున్నది జీవించరా మహా శక్తివై
కాలంతో జీవమై మహా దివ్య భావాలతో నన్ను సాగించరా
మహా కార్యాలతో సతమతమవుతూ కాలంతో ప్రయాణించలేక పోతున్నా
నీలోని శాంతి తత్వ గుణాలను నాకు అందిస్తూ నన్ను నీతో సాగించు
విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా
విశ్వమే ఆగేలా ఉందిరా ఓ కాలమా!
కాల భావన లేని విశ్వం మహా ప్రళయమే
మౌనంతో నిలిచే విశ్వం కాలానికే నిరంకుశం ||
No comments:
Post a Comment