Wednesday, June 17, 2015

నీ కోసం నేనే ఉన్నా ఓ మరణమా


నీ కోసం నేనే ఉన్నా ఓ మరణమా
నా కోసం ఎవరున్నా నీవే నేస్తమా
ఎవరో ఉన్నారని తెలిసినా మరిపిస్తావుగా
ఎంతో ఉందని అనుకున్నా వదిలిస్తావుగా
లోకమంతా ప్రయాణించినా నీ వరకేగా
విశ్వమంతా చూస్తున్నా నీవే కడసారిగా
ఎక్కడికో వెళ్ళాలనుకున్నా ఏదో చేయాలనుకున్నా చివరికి నీదేగా
ఏదో ఉందనుకున్నా ఎంతో పోయిందనుకున్నా నీతో నాకు ఏదీ లేదుగా
నాదంటూ ఎవరికి వెళ్ళినా నీదంటూ అందరికి ఉంటుందిగా
నా చుట్టూ ఏదున్నా నీ చుట్టూ నాకేది ఉండదుగా
జీవించుటకు ఎవరికి ఏమిస్తావో గాని మరణించాక అందరికి ఏదీ లేదుగా
జీవితాల సుఖ దుఃఖాలు ఏవైనా మరణాల లెక్కలు శూన్యమేగా

జన్మ ఏదైనా మరణం ఒకటేగా

జన్మ ఏదైనా మరణం ఒకటేగా
జీవితాలు ఏవైనా గమ్యం మరణమేగా
రూపం ఏదైనా మరణ వినాశనమేగా
విజ్ఞానం ఎంతైనా ఎంతటిదైనా మరణాంతమేగా 
జీవనం ఎలాంటిదైనా మరణ దారియేగా
ఉన్నంతలో ఎలా ఉన్నా కొండంత ఆశతో నైనా మరణమాగదుగా
ఊపిరిలోనే మరణం ఉన్నట్లు శ్వాసపై నిత్య ధ్యాస లేదుగా

Tuesday, June 16, 2015

అద్దమందు మనస్సు అందాన్ని అతికినట్లు

అద్దమందు మనస్సు అందాన్ని అతికినట్లు వర్ణించునా
సూదియందు దారం వస్త్రాన్ని కుట్టినట్లు ఎగిరిపడునా
జన్మయందు మరణం వయస్సును ఎదిగినట్లు చేర్చునా
విజ్ఞానమందు అనుభవం తరిగినట్లు నష్టం కలిగించునా 

Friday, June 12, 2015

ఏ శ్వాసలోనైనా ధ్యాసలోనైనా నేనే

ఏ శ్వాసలోనైనా ధ్యాసలోనైనా నేనే
ఏ ఆకార రూపములో నైనా నేనే
ప్రతి ఆకృతి ప్రకృతిలోనైనా నా భావమే
ప్రతి జీవి నిర్జీవములోనైనా నా స్పర్శయే

Monday, June 8, 2015

ఒకటే మాట ఒకటే భావం ఒకటే పదం

ఒకటే మాట ఒకటే భావం ఒకటే పదం పలికినదే స్నేహం
ఒకటే శ్వాస ఒకటే ధ్యాస ఒకటే మనస్సు తెలిపెను జీవం
మనలో మనమై మనస్సుతో జీవిస్తే మాటలో మధురమే
మనలో మనమై విజ్ఞానంతో ఎదిగితే మనస్సులో మౌనమే ॥ ఒకటే మాట ॥
మనిషిగా జీవిస్తూనే మనలోని శ్రమ నశించి పోతున్నది
వెల లేని జీవన విధానం విలువలేని శ్రమ వృధా ఐనది 
ప్రాణాలు రోగాలుగా మారి రాగాలు అరిగి తరిగి పోతున్నాయి
శ్వాస నిలువలేక పోతున్నా జీవాత్మ స్నేహమై నిలుపుతున్నది 
ఎప్పటిదాక ప్రయాణమో శక్తి లేని జీవం ఆరాట పడుతున్నది
గమ్యం లేని రహదారిలో గమనం లేక గానం ఘాటవుతున్నది 
మరణమే ధ్యాసగా రోగమే గమ్యమై శ్వాసే చిన్నదవుతున్నది
మనస్సే యాసగా రూపమే వికారిగా శరీరమే కూలిపోతున్నది   ॥ ఒకటే మాట ॥
ఆదుకునే భావం లేదు స్నేహమనే అర్థం అసలే లేదు మనలో
ఆశించకున్నా అసమర్థంగా చూసే భావన ఎందుకు మనలో
మనలో మనమే స్వార్థపరులైతే మనిషిగా మనిషికి మనుగడ ఎందుకో
మనిషే మనిషికి సహాయమైతే మనిషిలోని మానవత్వమే మరెందరికో
మనిషిలోని మేధస్సే మహా విజ్ఞానమైతే మనిషిగా మరెందరిలో జ్ఞానమే
మనిషిలోని ఆలోచనే అద్భుతమైతే మనిషిగా మనలో మహా విజయమే
మనిషిగా మనమంతా ఏకమై మహాత్ములుగా ఎదుగుదాం
మనిషిగా మహార్షులై అజ్ఞానాన్ని మరోవైపుగా తరిమేద్దాం   ॥ ఒకటే మాట ॥

Friday, June 5, 2015

శృతి లోని పదాలను శృతించరా

శృతి లోని పదాలను శృతించరా శివా
స్వరము లోని భావాలను స్మరించరా శివా

నీ శ్వాస లోని స్వర శృతులు స్వయంభువ శంఖములు
నీ ధ్యాస లోని స్వప్త స్వరాలు స్వయంకృత ప్రకాశములు ॥ శృతి ॥

భువి నుండి దివి వరకు ఓంకార లయ బద్ధమే
నాభి నుండి నాసికము దాక శ్వాసే ఓంకారము

ఆకార రూపాలలో అద్భుతాల అబేదమే నీ శరీరములు
ఆకృత వికృత విస్పోటన భావాలలో నీ వేద తత్వములే

విశ్వమందు నీవు నిలిచిన శివ లింగ రూపములే శిల క్షేత్రములు
కైలాసమందు నీవు లీనమైన చిత్రమే సృష్టికి భావ సుప్రభాతము  ॥ శృతి ॥

ఏ నామములో ఎక్కడ ఎలా ఉంటావో నీవే ఎరుక
నీ జీవ తత్వములు మరణములో నైనా నైతికమే

స్మశానమే దేవాలయమని తలిచే కర్త కర్మ క్రియ జీవి నీవే
అంతరంగమే ఆత్మాలయని కొలిచే ఆది పరమాత్మవు నీవే

అనంత జలచరాలకు పంచభూతాల విశ్వ శక్తి నీవే
అనంత జీవ భావాలకు ప్రతి అర్థ పరమార్థం నీవే         ॥ శృతి ॥