Monday, March 14, 2016

జీవితం ఒక విశ్వం

జీవితం ఒక విశ్వం
విశ్వం ఒక గొప్ప జీవిత అధ్యాయం
విశ్వ అధ్యాయం ఒక యుగాంతపు జీవన గమనం
జీవిస్తూ తెలుసుకునేది విశ్వం కాదు
ప్రకృతిని గమనిస్తూ తత్వ భావాలను శ్వాసతో గమనించడమే విశ్వం
విశ్వ భావాలు ప్రకృతి తత్వాలు దివ్యమైన విచక్షణ లక్షణాలతో కూడినవి
సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం చంద్రోస్తమయం విశిష్ట లక్షణాలు
ప్రతి క్షణం ప్రకృతి గమనం ఒక విధానమైన విశ్వ అధ్యాయ సాధన అనుభూతి
క్షణంలోనే ఎన్నో విశ్వ భావాలు మేధస్సులో గుణ లక్షణాలుగా చేరుతుంటాయి
శ్వాస ధ్యాస ప్రకృతి గమనం ఆలోచనలో దాగిన విశ్వ భావ స్వభావ జీవనము
విశ్వంతో జీవించడం మహా విజ్ఞానాన్ని అందుకోవడమే మహా అధ్యాయ జీవితం
ఒక జన్మలో విశ్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడమంటే
'ఆత్మ భావాలను అనుభవంతో గమనిస్తూ విశ్వాన్ని తిలకిస్తూ ఓ శతాబ్ధం జీవించడం' 

No comments:

Post a Comment