Thursday, March 31, 2016

ఏదో చేయాలి ఎంతో గ్రహించాలి ఏదో జరగాలి ఎందరో మెచ్చాలి

ఏదో చేయాలి ఎంతో గ్రహించాలి ఏదో జరగాలి ఎందరో మెచ్చాలి
ఏదో తెలియాలి ఎంతో తెలపాలి ఎవరైనా రావాలి ఎవరికో అందాలి
ఎవరితో నడవాలి ఎందుకో అడగాలి ఎంతైనా ఏదైనా నేర్చుకోవాలి  
ఎత్తైనా ఎదగాలి ఎక్కడైనా నిలవాలి ఎవరిలోనైనా నిలిచిపోవాలి
ఎంతని ఇవ్వాలి ఏమని చెప్పాలి ఎందరికై వెళ్ళాలి ఎందరికో సాగాలి
ఎప్పుడైనా ఒదగాలి ఎలాగైనా నెగ్గాలి ఏమైనా ఆడుతుండాలి
ఎంతవరకో పోవాలి ఎప్పటివరకో చూడాలి ఎందుకోనైనా చేయాలి
ఎలా ఉండాలి ఏమో అవ్వాలి ఎవరో నడిపించాలి ఎలాంటిదైనా కావాలి
ఏరా పిలవాలి ఏమిటని పలికించాలి ఏమో పొగడాలి ఏవో ఇవ్వాలి
ఎక్కించి ఎక్కాలి ఎక్కిళ్ళతో తీరాలి ఎక్కేస్తూనే మరణించాలి
ఎకరా కావాలి ఏకాంతం కలగాలి ఏకాగ్రతతో కలిసిపోవాలి
ఏమిటో పరిక్షించాలి ఎలక్ట్రాన్ని గుర్తించాలి ఏనాడైనా గమనించాలి
ఏ మాత్రం వేసుకోవాలి ఏ ఏ మంత్రాన్ని జపించాలి ఏహే అంటూ నవ్వాలి 

No comments:

Post a Comment