Tuesday, March 15, 2016

విశ్వమై వచ్చాను ఈ జగతికి విశ్వ భావమై ఉన్నాను ఈ లోకానికి

విశ్వమై వచ్చాను ఈ జగతికి విశ్వ భావమై ఉన్నాను ఈ లోకానికి
శ్వాసనై ఉన్నాను ప్రతి జీవికి ధ్యాసనై ఉన్నాను ప్రతి మేధస్సుకు ॥

సూర్యుడినై ఉదయిస్తూ విశ్వమంతా అవతరిస్తున్నా ఈ లోకానికి
చీకటితో అస్తమిస్తూ చంద్రుడినై జీవిస్తూ నక్షత్రాలతో వెలుగుతున్నా
నాలో దాగిన అణువుల సముదాయము నాలో  నిక్షిప్తమైన రూపాలే
నాలో ఉన్న రూపాలు విశ్వానికి తెలిపే విజ్ఞాన భావాల ఆకృతులే ॥

ఆశ్చర్యమో అద్భుతమో అన్వేషిస్తే భయాలు తొలగిపోయే విజ్ఞానమే
నిగూడార్థము తెలిసే వరకు విశ్వమున అన్వేషణలు ఎన్నో సాగేను
విశ్వమై ఉంటాను ప్రతి జగతికి విశ్వ భావాలతో జీవిస్తాను ప్రతి లోకంలో
జీవమై జీవిస్తాను ప్రతి జీవిలో ధ్యాసగా సాగిపోతాను ప్రతి మేధస్సులో ॥

No comments:

Post a Comment