Wednesday, October 25, 2017

ఎవరో మనకు మేలు చేసెదరు

ఎవరో మనకు మేలు చేసెదరు
ఎందరో మనకు కీడు చేసెదరు

ఎవరు మేలు చేసినా మనకు శుభమే
ఎందరో కీడు చేసినా మనకు అశుభమే  || ఎవరో ||

ఎవరి స్వభావం ఎలా ఉంటుందో మేధస్సుకే ప్రశ్నార్థకం
ఎవరి తత్వం ఎలా ఉంటుందో ఆలోచనకే సమస్యాత్మకం

ఎవరికి ఎవరు ఎదురౌతారో ఎలా ప్రవర్తిస్తారో తెలియని భావం
ఎవరికి ఎందరు ఎదురౌతారో ఎలా ఏంచేస్తారో తోచలేని తత్వం  || ఎవరో ||

మేలు చేసేవారు మనకు విజ్ఞానమే
కీడు చేసేవారు మనకు అనుభవమే

ఎవరు ఎలా జీవిస్తారో ఎలా ప్రవర్తిస్తారో కాలానికే ఎరుక
ఎవరు ఎలా వస్తారో ఎలా ఉంటారో సమయానికే ఎరుక  || ఎవరో ||

2 comments:

  1. మంచి కవితను అందించారు

    ReplyDelete
  2. Thank you for your comment - read number of poetry's (poetries) in this blog.

    ReplyDelete