Monday, October 9, 2017

మరణించెదనా భావ రోగాలతో

మరణించెదనా భావ రోగాలతో
జీవించెదనా తత్వ లోపాలతో
అనంత భావాల సర్వ తత్వాలతో నిత్యం జీవిస్తూ మరణించెదనా  || మరణించెదనా ||

జీవిస్తూనే మరణాన్ని తలచెదను
మరణిస్తూనే జన్మను తపించెదను

జీవించుటలోనే మరణాన్ని అన్వేషించెదను
మరణించుటలోనే జీవాన్ని పరిశోధించెదను

భావాలతోనే వేద రోగాల తత్వాలను గమనించెదను
తత్వాలతోనే జ్ఞాన లోపాల భావాలను స్వీకరించెదను  || మరణించెదనా ||

జీవించడమే రోగమా జన్మించడమే లోపమా అని తెలిపెదను
జీవించుటలో రోగం జన్మించుటలో లోపం అని వివరించెదను

జీవించడం రోగాలతో నయంకాలేని విధంగా సాగిపోయేను 
జననం లోపాలతో సరిచేసుకోలేని రకంగా ఆరంభమయ్యేను

రోగాలు దేహ భావాలకు నిలయంగా పరిశోధించెదను 
లోపాలు దేహ తత్వాలకు నిదర్శనంగా పరిగణించెదను  || మరణించెదనా ||

భావాలతో రోగాలను మరువలేను
తత్వాలతో లోపాలను విడవలేను

రోగాల బంధాలను మానుకోలేను
లోపాల దేహాలను మార్చుకోలేను

సర్వ రోగాలను అనుభవిస్తూనే మరణించెదను
అనంత లోపాలను సహకరిస్తూనే జీవించెదను  || మరణించెదనా || 

2 comments:

  1. ప్రతీ పంక్తిలోని భావం మనసుని తాకింది.

    ReplyDelete
  2. Every sentence writing should be a quote for knowledge with poetry - share with all

    ReplyDelete