ఏనాటిదో ఈ జీవితం ఏనాటికో ఈ జీవనం
ఎప్పటిదో ఈ దేహాత్మం ఎప్పటికో ఈ జీవాత్మం
ఎన్నడు లేని విధం నేడు సాగే జీవ ప్రయాణం || ఏనాటిదో ||
ఎన్నో ఆలోచనల కార్యాలతో సాగే అపురూపమైనది జీవితం
ఎన్నో భావాల తత్వాలతో సాగే ఆదర్శనీయమైనది జీవనం
నిత్యం జనన మరణ బంధాలతో సాగే భావాల చరితం
సర్వం సుఖ దుఃఖాల కార్యాలతో సాగే వేదాల చరణం || ఏనాటిదో ||
ఉచ్చ్వాసలోని శ్వాస దేహానికే పరిశుద్ధమైన పరమాత్మం
నిచ్చ్వాసలోని ధ్యాస జీవానికే పరిశోధనమైన పరమార్థం
జీవించుటలోనే ధ్యానం దేహానికి సంభోగమైన శాంతం ప్రశాంతం
మరణించుటలోనే దైవం ఆత్మకు సంయోగమైన శాంతం ప్రశాంతం || ఏనాటిదో ||