Friday, May 10, 2019

ఉన్నది ఏది లేనిది ఏది

ఉన్నది ఏది లేనిది ఏది
వచ్చేది ఏది రానిది ఏది

మనలో ఉన్నది ఎవరికి
మనతో ఉన్నది ఎందరికి

ఏది తెలిసినా ఎంతో తెలియాలని
ఎంత తెలిసినా ఏదో తెలుసుకోవాలని   || ఉన్నది ||

నా భావం ఎవరి వెంట లేదు
నా తత్వం ఎవరి వెంట రాదు

నా వేదం ఎవరి చెంత లేదు
నా జ్ఞానం ఎవరి చెంత రాదు

నా కోసం ఎవరి సమయం ఆగదు
నా దేహం ఎవరి సహాయం కోరదు

నా మేధస్సులో ఉన్న మర్మం ఎవరికి తెలియదు
నా శిరస్సులో ఉన్న మంత్రం ఎవరికి తోచబడదు  || ఉన్నది ||

నా రూపం ఎవరి వెంట నిలవదు
నా తాపం ఎవరి వెంట కలవదు

నా జీవం ఎవరి చెంత సాగదు
నా లోపం ఎవరి చెంత ఉండదు

నా కార్యం ఎవరి తరుణం మార్చదు
నా బంధం ఎవరి కలహం అంటదు

నా ఆలోచనలో ఉన్న గమనం ఎవరిని తపించదు
నా యోచనలో ఉన్న చలనం ఎవరిని వహించదు  || ఉన్నది || 

2 comments: