నా తల్లి శ్వాసలో జీవమై నిత్యం నేనే జీవించెదను
నా తల్లి ధ్యాసలో లీనమై సత్యం నేనే సాగించెదను
నా తల్లి ఉచ్చ్వాసలో దైవమై సర్వం నేనే గ్రహించెదను
నా తల్లి నిచ్చ్వాసలో దివ్యమై పర్వం నేనే రచించెదను
నా తల్లి మేధస్సులో తేజస్సునై నేనే ఉదయించెదను
నా తల్లి దేహస్సులో శ్రేయస్సునై నేనే అవతరించెదను
నా శ్వాస ధ్యాసలన్నీ నా తల్లి ఎదలో రక్షణగా నిత్యం విశ్వసించేను
నా యాస భాషలన్నీ నా తల్లి మదిలో శిక్షణగా సర్వం వికాసించేను || నా తల్లి ||
No comments:
Post a Comment