Tuesday, May 9, 2023

విశ్వాన్ని మార్చలేవుగా ఓ మనిషి

విశ్వాన్ని మార్చలేవుగా ఓ మనిషి 
దైవాన్ని చూడలేవుగా ఓ మనిషి 

భావాన్ని తాకలేవుగా ఓ మనిషి 
తత్త్వాన్ని తోచలేవుగా ఓ మనిషి 

రూపాన్ని దాచలేవుగా ఓ మనిషి 
వేదాన్ని మోయలేవుగా ఓ మనిషి 

జీవించుటలో గమనించే నీ మేధస్సు ఆలోచనలో లేదే నీ తేజస్సు 
జీవించుటలో తిలకించే నీ మనస్సు ప్రయోజనలో లేదే నీ రేతస్సు   || విశ్వాన్ని || 

Monday, May 1, 2023

మరణించే మందిరం శరీరమేగా

మరణించే మందిరం శరీరమేగా 
ఉదయించే మందిరం శరీరమేగా 

అమృతమై జీవించే మందిరం శరీరమేగా 
ఆరోగ్యమై ధ్యానించే మందిరం శరీరమేగా 

మరణమే లేని అమృతం ఆరోగ్యమై జీవించే మందిరమేగా 
మరణమే లేని మందిరం అమృతమై ధ్యానించే శరీరమేగా   || మరణించే || 

అమృత్వంలో దాగిన విశ్వ పోషకాలు జీవ భావాల దైవ తత్త్వాలేగా 
మాతృత్వంలో దాగిన జీవ పోషకాలు విశ్వ భావాల దేహ తత్త్వాలేగా 

అమృత్వంలో ఒదిగిన సర్వ పదార్థాలు జీవ కణాల దైవ పోషకాలేగా  
మాతృత్వంలో ఒదిగిన జీవ పదార్థాలు సర్వ కణాల దేహ పోషకాలేగా 

మందిరంలో ఎదిగిన అమృత్వ పోషకాలు మరణమే లేని జీవ కణాలేగా 
మందిరంలో ఎదిగిన మాతృత్వ పదార్థాలు మరణమేలేని దేహ కణాలేగా    || మరణించే ||