క్రమ శిక్షణ శ్రమ శిక్షణ అవసరమే మానవ మేధస్సుకు
స్వర శిక్షణ యోగ శిక్షణ అవసరమే మానవ దేహస్సుకు
వేద శిక్షణ నాద శిక్షణ అవసరమే మానవ శిరస్సుకు
గురు శిక్షణ తిరు శిక్షణ అవసరమే మానవ తేజస్సుకు
గమన శిక్షణ చలన శిక్షణ అవసరమే మానవ ఉషస్సుకు
సమయ శిక్షణ సాహస శిక్షణ అవసరమే మానవ యశస్సుకు
ఆరోగ్య శిక్షణ అభయ శిక్షణ అవసరమే మానవ దివ్యస్సుకు
అనంత శిక్షణ ఆనంద శిక్షణ అవసరమే మానవ మనస్సుకు
కదిలే కాలానికి కలిగే కార్యానికి సమయం సంసిద్ధం దేహం సంపుష్ఠిత నిరీక్షణం || క్రమ శిక్షణ ||
No comments:
Post a Comment