Tuesday, March 4, 2025

శ్వాస ఎక్కడ ఆగిపోయిందో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాస దేహానికి తెలియకుండానే మేధస్సుకు గమనం లేకుండానే పరధ్యాసతో శరీరం నిలిచిపోయింది

శ్వాస ఎక్కడ ఆగిపోయిందో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాస దేహానికి తెలియకుండానే మేధస్సుకు గమనం లేకుండానే పరధ్యాసతో శరీరం నిలిచిపోయింది  

ఉచ్చ్వాస ఆగిపోయిందో నిచ్ఛ్వాస నిలిచిపోయిందో దేహానికి తెలియకుండా పోయింది శ్వాస ప్రయాస అకాలమై  స్తంభించిపోయింది 

మేధస్సు ఎంత అన్వేషించినా హృదయంలో ధ్వని ప్రకంపన లేదు రుధిరానికి చలనం లేకుండా పోయింది స్వర నాళంలో వాయువు శూన్యమై పోయింది నాసికంలో ఏ చర్య లేదు ఇంద్రియాలకు నవరంధ్రాలకు ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది 

మేధస్సులో కణాల చలనం క్రియ గమనంతో ఎరుక నశించకముందే దివ్యమైన భావ తత్వాలతో ఒక ప్రశాంతమైన మహా ఆలోచన కలిగి హృదయంలో ఆగిన ఉచ్చ్వాస నిచ్చ్వాస ప్రభావం మళ్ళీ మేల్కొని దేహాన్ని శ్వాసతో సాగిస్తున్నది శరీరం ఉత్తేజమై మళ్ళీ యదా స్థితికి చేరుకుంది 

అప్పుడప్పుడు దేహాన్ని ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో గమనిస్తూ ప్రశాంతంగా ఆలోచిస్తూ మేధస్సును ఉత్తేజవంతం చేసుకోవాలి శ్వాసను సంపూర్ణమైన ఆరోగ్యంతో సామర్థ్యంతో  ఉంచుకోవాలి 

అనారోగ్యం కూడా ప్రశాంతమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస గమనంతోనే ఆరోగ్యవంతమౌతుంది 

ఎంత గొప్పగా ఆలోచిస్తే అంతటి విజ్ఞానము ఆరోగ్యము ప్రశాంతత కలుగును దేహం సురక్షితంగా సాగిపోవును 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment