శ్రమించడం తెలియదా శ్రమించడం తెలుసుకోవా
శ్రమించడం తోచదా శ్రమించడం తలచుకోవా (తలచవా)
శ్రమించడం కలుగదా శ్రమించడం నేర్చుకోవా
శ్రమించడం సహించవా శ్రమించడం ఓర్చుకోవా
శ్రమించడమే జీవించుటలో పరమ సౌఖ్యమని జీవితంలో తెలుసుకోలేవా నీవే గుర్తించలేవా
శ్రమించడమే ఎదుగుటలో పరమ భాగ్యమని సహితంలో తెలుపుకోలేవా నీవే ఆర్జించలేవా || శ్రమించడం ||
శ్రమకే సమయం లేదా శ్రమకే సహనం లేదా
శ్రమకే సహాయం లేదా శ్రమకే సమానం లేదా
శ్రమకే సమస్తం లేదా శ్రమకే సమర్థం లేదా
శ్రమకే సోపానం లేదా శ్రమకే సమ్మతం లేదా
శ్రమకే స్వతంత్రం లేదా శ్రమకే సంతోషం లేదా
శ్రమకే సులభం లేదా శ్రమకే సుఫలం లేదా
శ్రమించుటలో ఆలోచనలే కార్యాలను నడిపించే సమయ సాధన ఆయుధాల శాంతియుత విజయం
శ్రమించుటలో గమనములే కార్యాలను సమీపించే సమయ సహన స్వభావాల విశ్రాంతిత ప్రశాంతం || శ్రమించడం ||