Friday, December 12, 2025

త్వరగా మేల్కొంటే ఎన్నో జ్ఞాపకాలు మేధస్సులో కలుగుతాయి

త్వరగా మేల్కొంటే ఎన్నో జ్ఞాపకాలు మేధస్సులో కలుగుతాయి 
జ్ఞాపకాలు ఎన్ని మనలో చేరుతాయో మన జ్ఞానాన్ని అంతగా పెంచుతాయి 

మనం చేసిన కార్యాలు మనం చదువుకున్న విషయాలు పాఠాలు మనం ఆలోచించుకున్న ఉపాయాలు ప్రయోజనాలు (ప్రతో రోజు చేసే ఇంద్రియాల కార్యాలు) అన్నీ మేధస్సులో కలుగుతుంటాయి 
త్వరగా మేల్కొంటే మనం త్వరగా  చేసే కార్యాలు ఏవీ ఉండవు నిదానంగా ఆలోచిస్తూ మన దిన చర్య కార్యాలను చేసుకుంటూ ముందుకు సాగవచ్చు సమయాన్ని సమపాలలో ఉపయోగించుకోవచ్చు 

ఆలస్యంగా మేల్కొంటే మనం చేసే దిన చర్య కార్యాలను త్వరితంగా చేస్కుంటూ వెళ్ళిపోతాం అలాంటి సమయాలలో మనకు  ఏవి గుర్తుకు రావు జ్ఞాపకాలుగా ఏవి కలగవు 
వివిధ కార్యాలతో మనం నిమగ్నమైతే నిన్న లేదా పూర్వం చేసిన కార్యాలు ఏవి జ్ఞాపకాలకు రావు గొప్ప ఉపాయాలు కలగవు కేవలం దిన చర్య కార్యాలను చేసుకుంటూ వెళ్ళిపోతాం జ్ఞాపకాలు తగ్గిపోతాయి జ్ఞానం తగ్గిపోతుంది 

మేధస్సు దినచర్యల కార్యాలకే అలవాటు పడిపోతుంది - కొత్త దనాన్ని ఆలోచించదు కొత్త కార్యాలకు సమయాన్ని వెచ్చించదు 

త్వరగా మేల్కొంటే ఎన్నో కొత్త కార్యాలు చేసుకోవచ్చ్ ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతో అభివృద్ధి సాధించవచ్చు ఉపయోగకరమైన దూర ప్రయాణాలు చేసుకోవచ్చుఎంతో జ్ఞానాన్ని గ్రహించవచ్చు 

జ్ఞాపకాలే జ్ఞానం - చదువుటలో నేర్చుకొనుటలో జ్ఞాపకాలే విజ్ఞానం - ఎంతగా జ్ఞాపకం చేసుకుంటే మనం అంతగా పరీక్ష వ్రాసుకోవచ్చు ఉత్తరాలను (సమాధానాలను) గ్రహించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!
 

No comments:

Post a Comment