అందరూ తెలిసినవారే ఇక ఎందుకు ఎవరిని ద్వేషించాలి
అందరు అందరిని అప్పుడప్పుడు సమాజంలో కలుసుకుంటూ జీవిస్తుంటాం
పరిచయాలు లేకున్నా కావలసిన దాని కోసం అడుగుతూ అమ్ముతూ కొనుక్కొంటూ సాగిపోతాం
ఎందరినో గుర్తు పెట్టుకుంటాం ఎందరినో మరచిపోతుంటాం ఎందరి రూపాలో గుర్తుండిపోతాయి
కొందరిని ఒకసారి కలుస్తాము మరికొందరిని రెండు లేదా అంతకన్నా ఎక్కువగా కలుసుకుంటుంటాం
ప్రతి రోజు కలిసే వారు ఉన్నారు ఎప్పుడూ కలవని వారు మనం వెళ్ళని ప్రదేశాలలో జీవిస్తుంటారు
ఇతర ప్రదేశాలకు మనం వెళ్ళలేక పోయినా ఇతరులు మనకు తెలిసిన వారు తెలియని వారు వెళ్ళి ఎందరినో ఎన్నో రకాలుగా కలుస్తుంటారు
ఒకరినొకరు మాట్లాడూతూ అలా తెలుసుకుంటూ పొతే అందరిని తెలుసుకోవచ్చు అందరు తెలిసినవారు అవుతారు
ఎక్కువగా తెలుసుకుంటే స్నేహితులుగా బంధువులుగా సహాయకర్తలుగా గురువులుగా మహాత్ములుగా తెలిసిపోతారు
ఎన్నో సందర్భాలలో సంభరాలలో ఉత్సవాలలో మహోత్సవాలలో పండుగ సమయాలలో ప్రయాణాలలో వివిధ రోజుల కార్యాలలోఎందరినో కలుస్తూ జీవిస్తూ కార్య గమనంతో వెళ్ళిపోతుంటాం
ప్రపంచమంతా చుట్టూ ప్రయాణిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న వారిని తెలుసుకోవడం మనం నడిచే విధానంపై ఆధారపడి ఉంటుంది
మనం అందరం మానవులం మనకు మనం తెలియాలి తెలుసుకోవాలి తెలుసుకుంటే తెలియని వారు లేరు
ఒకరికి మరొకరు తెలుసు మరొకరికి ఇంకొకరు తెలుసు అలాగే ఒకరికి ఒకరు తెలుసుకుంటూ పోతే సమాజమంతా జగమంతా తెలిసినవారే ఉంటారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment