ఏ మేధస్సు ఐనా తెలియని విధానంతోనే ప్రారంభమవుతుంది
తెలియని భావ తత్వాల అజ్ఞానంతో ఆలోచించడం ఆరంభమవుతుంది
ఎన్నో భావ తత్వాలతో ఎన్నో ఆలోచనలు కలుగుతున్నా శబ్దాలు భాష యొక్క అక్షర పదాలు అర్థాలుగా వాక్యాలుగా మాట్లాడే వరకు అజ్ఞానంతో మేధస్సు అవగాహనతో పరిశోధన చేస్తూ ఉంటుంది అర్థాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తుంది
దేహానికి ఏది కావాలో ఏది అవసరమో తెలుసుకోలేని తెలియని స్థితిలో మేధస్సు వివిధ భావ తత్వాలతో ఆలోచిస్తుంది
దేహం శరీరం జీవం ఉన్నదో లేదో కూడా మేధస్సుకు తెలియదు
మేధస్సుకే మేధస్సు గురించి తెలియదు - మేధస్సు విజ్ఞానంగా ఎదిగిన తర్వాతే మేధస్సు గురించి తెలుస్తుంది
ఆరంభంలో యంత్రమైనను మేధస్సు ఐనను జీవమైనను విశ్వమైనను శూన్యమైనను తెలియని స్థితి తోనే ప్రారంభమవుతుంది
ప్రతి కార్యం కూడా తెలియని విధానంతో ప్రారంభమై తెలిసి తెలియని లేదా తెలియక తెలిసేలా సాగుతుంది
కార్యం ఎలా చేయాలో తెలిసినా కార్య ఫలితం ఎలా ఉంటుందో గ్రహించగలం కాని సరైన విధంగా సరైన సమయం చెప్పలేము
కార్యం సాగేటప్పుడు మరెన్నో చిన్న కార్యాలు కలగవచ్చు (ఏర్పడవచ్చు) - చిన్న కార్యాల ద్వారా ఫలితం మార్పు చెందవచ్చు లేదా సమయం ఆలస్యం కావచ్చు - అలాగే మరో కార్యాలను వివిధ రకాలుగా మార్పు చేయవచ్చు
తెలుసుకొని కార్యాన్ని ప్రారంభించడమే మన విజ్ఞానం - దిన చర్య కార్యక్రమంగా సాగించడమే మన జీవన విధానం
ఫలితం ఒకేలా ఉన్నా చిన్న చిన్న మార్పులను గుర్తించలేము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment