విశ్వ విజ్ఞాన బ్రంహాండమంతయు మేధస్సులోనే అమర్చుకొని ఎలా భరిస్తున్నావు ఎలా సమిష్టిగా జీవిస్తున్నావు
బ్రంహాండంలో కలిగే అనంతమైన భావ తత్వాలను విజ్ఞాన ఆలోచనల కార్యాలను ఎలా గ్రహిస్తున్నావు ఎలా మేధస్సులో ఇమిడిపోయేలా అమర్చుకుంటున్నావు
పిడికిలి అంతటి మేధస్సులో బ్రంహాండమంతటి విజ్ఞానం చేరుకొనుట (చేరిపోవుట) మహా మంత్ర మర్మ రహస్యమే మహా విజ్ఞాన జ్ఞాపకాల ఆకాశ ప్రదేశ విశ్వ క్షేత్రమే
అణువు భావమైన మరచిపోలేదు పరమాణువు తత్వమైన మరువలేదు సూక్ష్మ రూప కార్యమైనా తెలియకుండా పోలేదు సర్వం మేధస్సులోనే ఎన్నో విధాలుగా ప్రకృతి స్వరూపాలుగా విశ్వ విజ్ఞానమంతయు బ్రంహాండమై మేధస్సులోనే నిక్షిప్తమై ఉంటున్నది
బహు జ్ఞాన భళా! బహు విజ్ఞాన జాణ! బహు ప్రజ్ఞాన జటాధరా! (జటాధారా [విజ్ఞాన విధాత]: ఊడల వలె జ్ఞానము పెరుగుతూ ఉండేది - విజ్ఞాన విధాత)
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment