Thursday, December 11, 2025

పరిశుద్ధమైన పరిపూర్ణమైన రూపమా ప్రభూ ... ! మహా ప్రభూ ... !

పరిశుద్ధమైన పరిపూర్ణమైన రూపమా ప్రభూ ... ! మహా ప్రభూ ... !
పర్యావరణమైన పత్రహరితమైన రూపమా ప్రభూ ... ! మహా ప్రభూ ... !

సారవంతమైన పరిమళ ప్రాంతీయమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... ! 
కాంతి కిరణాల సుగంధాల ఉద్యానవనమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

అత్యంత పర్వతాల ఆనంద ప్రభంజనమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
కైలాస శిఖరాల తాండవ తంబూర నాదమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

సూర్యోదయ కిరణాల ప్రకాశిత ప్రజ్వలమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
సూర్యాస్తమయ స్మరణాల మేఘముల వర్ణత్వమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

సాగర తీరముల అలల కెరటాల ధ్వనితమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
ఉరుముల మేఘాల జలపాతాల ప్రవాహమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

ఆలయాల క్షేత్రాల రాతిశిల్పాల రమణీయమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
మైదాన ఆవరణాల అఖండ ద్వార గోపురమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

ఉత్సవాల మహోత్సవములలో గజేంద్రునిపై ఊరేగే దైవధాతమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
సంబరాల బ్రంహోత్సవాలలో రథములపై ఒదిగే సంధానిత విగ్రహమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

ఆకాశ ఇంద్రధనస్సుల వర్ణాలలో మెరిసే కాంతుల కమనీయమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
తారల నక్షత్రాల మెరిసే మిణుకు తళుకుల నేత్ర కాంతి దర్శనమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment