Sunday, December 14, 2025

తెలిసిన విధానం నుండే తెలియని దానిని తెలుసుకుంటావు

తెలిసిన విధానం నుండే తెలియని దానిని తెలుసుకుంటావు 

తెలిసిన దానిని అవగాహన చేసుకుంటూ పోతే తెలియని విషయాలు వివిధ కార్యాల ద్వారా తెలుస్తుంటాయి 
ఎన్నో కార్యాలతో సాగే మానవ జీవనం ఎన్నో అవగాహనలను చేస్తూ ఎన్నింటినో గ్రహిస్తూ ఎన్నింటినో తెలుసుకుంటూ సాగిపోతుంది 

తెలియనివి అజ్ఞానం కాదు తెలియని విజ్ఞానం 
అజ్ఞానమంటే మనం చేసే పొరపాట్లు మనకు కలిగే అజాగ్రతల ప్రమాదాలు మనకు కలిగే నష్టాలు మన నుండి ఏర్పడే అశుభ్రతలు ఇలా ఎన్నెన్నో అజ్ఞానం వల్ల మరుపు వల్ల తెలియని జ్ఞానం వల్ల జరిగిపోతూ ఉంటాయి  

ప్రతి కార్యంలో తెలివిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎరుకతో ఉండాలి కాల ప్రభావాలపై చుట్టూ సమాజ రీతిపై ప్రతి దానిపై అవగాహన ఇంద్రియ విజ్ఞానం ఉండాలి 

ప్రతి జీవి తెలియని దానిని నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంటాయి విజ్ఞాన అనుభవాలతో జీవిస్తాయి 
ఏ జీవికి ఎంత విజ్ఞానం ఉన్నా జీవించుటలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మరణం వరకు వెంటాడుతూనే ఉంటాయి సహజమైన మరణం లేక అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది శక్తి సామర్థ్యాలు పెరిగినవన్నీ వృద్ధి చెందినవన్నీ తగ్గిపోతూనే ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment