Thursday, December 11, 2025

ఆనాడు గాలి స్వచ్ఛమైన మట్టిని ఆకుల చిగుర్లను తాకుతూ పుష్పాల గంధాలతో విహరిస్తూ శరీరాన్ని తాకుతూ దేహాన్ని పరిశుద్ధం చేస్తుంది

ఆనాడు గాలి స్వచ్ఛమైన మట్టిని (భూమిని, పంటలను వృక్షాలను నదులను) ఆకుల చిగుర్లను తాకుతూ పుష్పాల గంధాలతో (వివిధ పుష్పాల సువాసనలను కలుపుకొని) విహరిస్తూ శరీరాన్ని తాకుతూ దేహాన్ని పరిశుద్ధం చేస్తూ శ్వాసను ఆరోగ్యవంతం చేస్తూ శక్తి సామర్థ్యాలను కలిగిస్తూ తిరిగి మళ్ళి స్వచ్ఛమైన ప్రదేశాలకు వెళ్ళిపోయేది 

ఈనాటి గాలి రాళ్ళపొడితో (సూక్ష్మమైన రాళ్ళ చూర్ణం) కలుషితమైన ధూళితో వాహనాల కాలుష్యంతో అనేక వస్తువుల ఆహార వ్యర్థ పదార్థాల వాసనలతో  అంతస్తుల భవనాల నుండి వివిధ రకాల ఉత్పత్తుల కర్మాగారాల నుండి వస్తూ తెలియని అనారోగ్యాన్ని కలిగిస్తున్నది 
అంతస్తులలో ఎటువంటి గాలులు ఎటువంటి వాసనలతో కర్మాగారాల నుండి ఎటువంటి దుర్వాసనాలతో వీస్తూ సామాజంలో ఎలా కలిసిపోతూ ఎటువంటి పరిణామాలతో వస్తుందో జీవించుటలో తెలుస్తుంది 
 

ఆనాటి గాలి ప్రకృతితో కూడినది ఈనాటి గాలి సమాజంతో కూడినది 

ఆనాటి గాలి సహజమైనది ఈనాటి గాలి సామాజమైనది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment