Wednesday, December 17, 2025

సర్వం తెలియాలంటే శరీరాన్ని సర్వేంద్రియంగా మార్చుకోవాలి

సర్వం తెలియాలంటే శరీరాన్ని సర్వేంద్రియంగా మార్చుకోవాలి 
మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అవగాహన చేసుకుంటూ ప్రకృతిని పరిశోధన చేస్తూ అనేక కార్యాలను గమనిస్తూ సాగిపోవాలి 
 
పరిశోధించుటలో మనకు తెలియకపోయినా మనం గమనంతో సాగే కార్యాల విధానాలలో ఎన్నో విషయాలు తెలుస్తాయి 

ప్రకృతి శాస్త్రీయం సహజమైన కార్య సిద్ధాంతం కార్యక్రమ కార్యాచరణం తెలుసుకోవాలి అప్పుడే కాలంతో కలిగే మార్పులు ఋతువుల ప్రభావాలు వాటి స్థితి పరిస్థితుల పరిణామాలు తెలుస్తాయి 

మన చుట్టూ సమాజంలో జరిగే కార్యాలు కూడా మనకు అవగాహనతో తెలియాలి 
అణువుల పరమాణువుల స్థితులను వాటి కాల సమయాల ప్రభావాలను తెలుసుకోవాలి 

మేధస్సును ఆకాశంలా విస్తృతం చేసుకోవాలి ఎన్నో విషయాలను గ్రహిస్తూ విజ్ఞానాన్ని పెంచుకోవాలి 

విజ్ఞానాన్ని సురక్షితంగా పరిశుద్ధంగా ప్రయోజనకరంగా అభివృద్ధిపరంగా ఆరోగ్యంగా ఉపయోగించుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment