Thursday, April 2, 2015

సృష్టిని గ్రహణం వీడుతుందేమో

సృష్టిని గ్రహణం వీడుతుందేమో గాని మనిషిని కర్మ వీడదు
మరణం కర్మను వీడుతుందేమో గాని జన్మను ఏ మాత్రం వీడదు
ఆత్మ - కర్మ సిద్ధాంతముచే ఉద్భవించినది
ప్రతి జీవి ఆత్మ బంధముచే జన్మిస్తుంది
ప్రతి అణువు ఆత్మచే సృష్టింపబడుతుంది
ప్రతి అణువుకు ప్రతి జీవికి జీవిత కాలపు కార్యాలు ఉంటాయి
కర్మ అనగా కార్యం దానిని విజ్ఞాన అనుభవముచే చేధించాలి 
జీవిత కాలంలో మనం ఎన్నో కార్యాలను చేధిస్తూ సాగిపోవాలి
కృషితో నాస్తి దుర్భిక్షం విజ్ఞానంతో కర్మ చేధనం
సృష్టిని గ్రహణం వీడినా ప్రళయం వెంటాడుతూనే ఉంటుంది
సృష్టిని వెంటాడే కర్మలు - కరువు తుఫాను సునామి భూకంపం అగ్ని వాయు ఇసుక పొగ పర్వతాల భీభత్సాలు ఎన్నో
జీవితం అంటే కర్మను విజ్ఞానంతో ధైర్యంగా ఎదుర్కోవడమే
కార్య ఫలితము నష్టమైనా లాభమైనా ఆత్మ తృప్తియే
అనుభవ విజ్ఞాన సత్యముచే కర్మను ఆశ్రయించుట శ్రేయస్కరము
కార్యం ఉన్నంతవరకే శరీర జీవితం కార్యం లేనిచో ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది
కర్మ కార్యాలు పంచ భూతాలతో కూడి ఉంటాయి
ఆత్మ శరీరాన్ని వదిలినచో శరీరం పంచ భూతాలలో శూన్యమవుతుంది

No comments:

Post a Comment