Friday, April 3, 2015

స్వరము లేని సంగీతం సప్త స్వరాలుగా

స్వరము లేని సంగీతం సప్త స్వరాలుగా కదిలేనా నా మేధస్సులో
రాగం లేని నా పలకులలో రత్నాలను సృష్టించే గీతం నా యదలోనే
మనస్సు లేని మోహ భావం మకరందాన్ని పంచే మేఘ సందేశం
జీవమే లేని నా శ్వాస సరిగమలతో విశ్వమంతా జీవిస్తున్నది
--
కళ్ళు ఉన్న కళ లేని  చంద్రకళకు విశ్వ కాంతి ఉన్నదేమో
భావం ఉన్న ప్రతి రూపానికి బహు బంధాల స్వరాలు ఎన్నో
విద్య లేని వేదమైనా ఆవేదనలో వేదాంతమే ఉద్భవించేను
సంగీతాల వేద భావాలు జీవ రాగాలుగా సంగీతమయ్యేను

No comments:

Post a Comment