దేవుడే లేడని అనుకొంటివా!
ఇక మోక్షమేలా ఆపై నీకు స్వర్గమేలా - ఓ మానవా! || దేవుడే లేడని అనుకొంటివా! ||
మనస్సు నీదేగా శ్వాస నీలోనే ధ్యాస నీతోనే
ఇక మేధస్సుతో ఆలోచిస్తే నీకే తెలియునులే
విశ్వ మందు ఏమున్నదో నీకే ఎరుకలే
భావాలతో ఏకీభవిస్తే అన్నీ నీకే తెలిసేనులే
జగతిని సృష్టించినది మానవుడేనని నీలో సందేహమా
బ్రమ్హాండాన్ని అమర్చినది మానవులేనని మరో సందేహమా
దేవుడే లేనిదే విత్తనం లేదయ్యా
చెట్టే పెరగనిదే దైవం లేదయ్యా
ఆలోచిస్తే దేవుడు నీలోనే ఉన్నాడు
దైవం కూడా నీలో ఉన్న శక్తి స్వరూపమే || దేవుడే లేడని అనుకొంటివా! ||
మాత్రు భావాలే సృష్టి స్వరూపాలకు నిలయం
విశ్వ భావాలే జగతిలోని బంధాలకు నిదర్శనం
నీవు సృష్టించేది ఏదీ లేదయ్యా
నీకు తెలిసేదే ఎంతో ఉందయ్యా
మేధస్సుతో ఆలోచిస్తే మేధావివి కాలేవు
మనస్సుతో ఆచరిస్తే ముక్తిని పొందలేవు
అనుభవాలతో ఎకీభవిస్తేనే అద్భుతాన్ని చూసెదవు
జీవితాన్ని విజ్ఞానంతో సాగిస్తేనే గమ్యాన్ని చేరెదవు
లోకాలెన్నో చూడాలంటే దైవ శక్తి అవసరమే
దేవుడే ఉన్నాడంటే నీకు జీవ శ్వాస అవసరమే || దేవుడే లేడని అనుకొంటివా! ||

No comments:
Post a Comment