ఆగాలని లేదు ఆగినా ఆగి పోవాలని లేదు
ఆగితే సాగాలని ఆగెంత సమయం లేదు
ఆగేలా మరణమైనా లేదు ఆగి పోయేలా విశ్వమైనా లేదు
మరణం నాకు అసలే లేదు విశ్వానికి కాస్తైనా లేనే లేదు
క్షణమైనా ఆగాలని నాలోనే లేదు ఇక విశ్వానికి ఏనాటికి లేదు
ఆగితే నేను నా విశ్వంతోనే ఆగాలని విశ్వమే నాతో ఆగేలా లేదు
నేనే కాలమై విశ్వంలో ఏకమై క్షణాలుగా విడి పోవాలని లేదు
కలిసే విశ్వ కాలమై సాగే సమయమై విడిచి పోవాలని లేదు
విశ్వాన్ని విడిచి పోవాలని లేదు విశ్వమే నన్ను విడవాలని లేదు
విశ్వమే నన్ను విడిచి పోయేంత సందేహము ఏనాటికి లేదు
ఆగిపోయేలా విడిచి పోలేము విడిచి పోయేలా ఆగలేము
ఏనాటికైనా ఆగలేమని ఎక్కడికైనా ఎప్పటికైనా విసిగి పోలేము
ఎవరితోనైనా ఆగలేము ఎంతటి ప్రళయ మైనా ఆగి పోలేము
ఎంతటి భయంకరమైనా ఆగము ఏనాటికైనా ఆగలేము
ఎవరున్నా లేకున్నా అలసట లేక అలాగే సాగి పోయెదము
ఏది ఉన్నా లేకున్నా కనిపిస్తున్నా కనిపించకున్నా సాగెదము
ఎవరు ఆపాలనుకున్నా ఏది ఆపాలనుకున్నా వీలు లేదు
ఎవరు ఉండాలనుకున్నా ఏది ఉండాలనుకున్నా ఎప్పటికీ మాతో సాగేది లేదు

No comments:
Post a Comment