Thursday, March 31, 2016

ఏదో చేయాలి ఎంతో గ్రహించాలి ఏదో జరగాలి ఎందరో మెచ్చాలి

ఏదో చేయాలి ఎంతో గ్రహించాలి ఏదో జరగాలి ఎందరో మెచ్చాలి
ఏదో తెలియాలి ఎంతో తెలపాలి ఎవరైనా రావాలి ఎవరికో అందాలి
ఎవరితో నడవాలి ఎందుకో అడగాలి ఎంతైనా ఏదైనా నేర్చుకోవాలి  
ఎత్తైనా ఎదగాలి ఎక్కడైనా నిలవాలి ఎవరిలోనైనా నిలిచిపోవాలి
ఎంతని ఇవ్వాలి ఏమని చెప్పాలి ఎందరికై వెళ్ళాలి ఎందరికో సాగాలి
ఎప్పుడైనా ఒదగాలి ఎలాగైనా నెగ్గాలి ఏమైనా ఆడుతుండాలి
ఎంతవరకో పోవాలి ఎప్పటివరకో చూడాలి ఎందుకోనైనా చేయాలి
ఎలా ఉండాలి ఏమో అవ్వాలి ఎవరో నడిపించాలి ఎలాంటిదైనా కావాలి
ఏరా పిలవాలి ఏమిటని పలికించాలి ఏమో పొగడాలి ఏవో ఇవ్వాలి
ఎక్కించి ఎక్కాలి ఎక్కిళ్ళతో తీరాలి ఎక్కేస్తూనే మరణించాలి
ఎకరా కావాలి ఏకాంతం కలగాలి ఏకాగ్రతతో కలిసిపోవాలి
ఏమిటో పరిక్షించాలి ఎలక్ట్రాన్ని గుర్తించాలి ఏనాడైనా గమనించాలి
ఏ మాత్రం వేసుకోవాలి ఏ ఏ మంత్రాన్ని జపించాలి ఏహే అంటూ నవ్వాలి 

వర్ణమే తెలిపింది భావమే ఆలోచనతో మేధస్సునే మెప్పించింది

వర్ణమే తెలిపింది భావమే ఆలోచనతో మేధస్సునే మెప్పించింది
వర్ణ తేజస్సే సూర్య కిరణమై విశ్వలోక విజ్ఞానాన్ని కలుగజేసింది
వర్ణ కాంతిలో దాగిన బింభము ప్రతి బింభపు భావాలనే తెలిపింది
వర్ణ కిరణంలో చేరిన వేద భావం ఆలోచనలలో ఉత్తేజమై నిలిచింది
వర్ణ భావాల ఉన్నతిలో సద్భావాల సంస్కృతి అన్ని దిక్కులకు వెళ్ళింది
వర్ణమే సూర్యోదయమై విశ్వ లోకాలకు సుదీర్ఘ కాలమై వ్యాపించింది 

వర్ణ తేజస్సులో దాగిన మోహా గుణాంగమే దేహానికి వైభోగము

వర్ణ తేజస్సులో దాగిన మోహా గుణాంగమే దేహానికి వైభోగము
వర్ణ కాంతిలో యిమిడియున్న దేహాంగమే జీవిత సంయోగము
వర్ణ ఛాయలో అణిగి ఉన్న స్వరాంగమే జీవన గాన సంభోగము
వర్ణ ప్రకాశంలో విస్తరించి ఉన్న జీవాంగమే జీవుల సద్భోగము
 వర్ణ ప్రజ్వలంలో జలించి ఉన్న చతురాంగమే అంగ రంగ సుభోగము

హృదయమే సూర్యుడై మేధస్సులో ఉదయించేనా

హృదయమే సూర్యుడై మేధస్సులో ఉదయించేనా
ఆలోచనే ఆకాశమై విశ్వ లోకమంతా జీవించేనా
భావమే బ్రంహాండమై అంతరిక్షాన్ని చుట్టేసేనా
దేహమే దైవమై ఆత్మగా జీవులలో అవతరించేనా
చలనమే కార్యమై కాలంతో యుగాలుగా సాగించేనా

Wednesday, March 30, 2016

బ్రంహోత్సవం జరగాలి బ్రంహే ఆశీర్వదించాలి

బ్రంహోత్సవం జరగాలి బ్రంహే ఆశీర్వదించాలి
నిర్మాణం ఎదగాలి మందిరం ఆకాశాన్నే అధిగమించాలి
శిల్పం మేఘాన్ని తాకేలా గోపురం లోకాన్నే చూడాలి
కైలాసమే స్వర్గమై నేలపై కనిపించేలా మహా ద్వారమే కట్టాలి
దైవమే దీవించేలా జనమే మెచ్చేలా జీవితాలు సాగాలి
ఆరోగ్యమే వందేళ్ళుగా యుగాలతో నడిచేలా బ్రంహోత్సవమే మళ్ళీ జరపాలి 

వేదం అంటేనే చర్చాంశ నీయమైన ఆలోచన భావాల వివరణాత్మకం

వేదం అంటేనే చర్చాంశ నీయమైన ఆలోచన భావాల వివరణాత్మకం
ఆలోచన భావాలలో దాగిన సూక్ష్మ విజ్ఞానమే పవిత్రమైన వేద శుద్ధాత్మం
సమయాలోచన ఉన్నా సందర్భ సంస్కృతి సిద్ధాంత విధానమే వేదాత్మకం
పరిశుద్ధమైన వేదం పరిపూర్ణ భావాల పవిత్రతతో కూడిన సిద్ధాంత నిపుణం

మీలోని వేదం నాలోని సిద్ధాంతం ఒకటైతే విశ్వ వేదాంత విజ్ఞానమే

మీలోని వేదం నాలోని సిద్ధాంతం ఒకటైతే విశ్వ వేదాంత విజ్ఞానమే
విశ్వ భావాలతో సాగే సిద్ధాంతం విశ్వ విజ్ఞాన వేద సాగర పర్వతమే
నా మేధస్సులో కలిగే విశ్వ భావాలే శాస్త్రీయ జీవిత మహా గ్రంథమే
అను క్షణం వేదాంతం ఆలోచనలలో విశ్వ భావాత్మం ఆధ్యాత్మమే 

Tuesday, March 29, 2016

ఏ వేదం నిన్ను కదిలించినది ఏ భావం నిన్ను మెప్పించినది

ఏ వేదం నిన్ను కదిలించినది ఏ భావం నిన్ను మెప్పించినది
ఆలోచన లేక మాటే నిలిచేలా మౌనం నిన్ను ఆవహించిందా
వేదంలో తెలిసే గొప్ప భావాలు మేధస్సులకే మహా సిద్ధాంతాలు
జీవమే వేదమై జీవించే విజ్ఞానమే మహా జ్ఞానుల పరమార్థ సిద్ధాంతము

మాటే మౌనమై మనసే ధ్యాసగా ఆలోచన అదృశ్య భావమై

మాటే మౌనమై మనసే ధ్యాసగా ఆలోచన అదృశ్య భావమై శ్వాసలో లీనమౌతున్నదే
దేహం నికడతో ఆత్మే ధ్యానిస్తూ జీవమే విశ్వమై సూక్ష్మ శరీరమే ప్రయాణిస్తున్నది
యుగాలుగా సాగే ప్రయాణములో శుద్ధాత్మ ఆరా చక్రమై విశ్వమంతా వ్యాపిస్తున్నది
ధ్యానం జీవుల ఆత్మల అంతర్లీనపు విశ్వ భావాల చైతన్య సమగ్ర సిద్ధాంత సన్నిదే 

విశ్వానికి తలుపులు వేసి నిద్రిస్తున్నావా మానవా

విశ్వానికి తలుపులు వేసి నిద్రిస్తున్నావా మానవా
మేధస్సులో ఆలోచనలను మరిపించేసి నిద్రించెదవా
విశ్వపు తలపులయందైనా స్వప్న భావాలు కలగవా
విశ్వానికి తలుపులు వేయుట మేధస్సుకు మరణమే మానవా
నీ కంటి రెప్పలు విశ్వపు తలపుల ఆలోచన భావాలే మిత్రమా !

Thursday, March 24, 2016

మేధస్సుకే అంతా తెలియునా తెలుసుకోవా మానవా

మేధస్సుకే అంతా తెలియునా తెలుసుకోవా మానవా
మనస్సుకే తెలియనిది కొంతైనా ఉన్నదా మేధస్సులో
ప్రతి కార్యాన్ని మేధస్సే చేయునా మనతో చేపించునా
నిత్యం శ్రమించే మేధస్సులో నిద్రైనా ఓ మహా కార్యమే
ప్రతి క్షణం ఎన్నో కార్యాలతో మనిషిని చలింపజేస్తుంది
మేధస్సు ఆగిన క్షణం ప్రతి జీవికి అకార్య మరణమేనా  
ప్రతి సూక్ష్మ కార్య కదలిక విచక్షణ జ్ఞానేంద్రియాల క్షణ కాల మేధస్థితియే
ఆలోచిస్తే తెలిసేది కొంత తెలియనిది మేధస్సులో దాగున్నది కొండంత
మేధస్సులో ప్రతి దేహ అణువు క్రియా విశేష చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది
మరణించే వరకు దేహ చరిత్ర ప్రపంచ విజ్ఞానము మేధస్సులోనే చేరుతుంది
వివరించే భావాలకు అర్థాలు ఎన్నో తెలియని పరమార్థం ఎంతో మేధస్సుకే ఎరుక
మరచిపోయిన జ్ఞాపకాలు ప్రతి కార్య విజ్ఞానం మేధస్సులోనే నిక్షిప్తమై ఉంటుంది
ప్రతి విషయాన్ని గమనించి తెలుసుకునే విజ్ఞాన సామర్థ్యం మేధస్సుకే ఉన్నది

Tuesday, March 15, 2016

విశ్వమై వచ్చాను ఈ జగతికి విశ్వ భావమై ఉన్నాను ఈ లోకానికి

విశ్వమై వచ్చాను ఈ జగతికి విశ్వ భావమై ఉన్నాను ఈ లోకానికి
శ్వాసనై ఉన్నాను ప్రతి జీవికి ధ్యాసనై ఉన్నాను ప్రతి మేధస్సుకు ॥

సూర్యుడినై ఉదయిస్తూ విశ్వమంతా అవతరిస్తున్నా ఈ లోకానికి
చీకటితో అస్తమిస్తూ చంద్రుడినై జీవిస్తూ నక్షత్రాలతో వెలుగుతున్నా
నాలో దాగిన అణువుల సముదాయము నాలో  నిక్షిప్తమైన రూపాలే
నాలో ఉన్న రూపాలు విశ్వానికి తెలిపే విజ్ఞాన భావాల ఆకృతులే ॥

ఆశ్చర్యమో అద్భుతమో అన్వేషిస్తే భయాలు తొలగిపోయే విజ్ఞానమే
నిగూడార్థము తెలిసే వరకు విశ్వమున అన్వేషణలు ఎన్నో సాగేను
విశ్వమై ఉంటాను ప్రతి జగతికి విశ్వ భావాలతో జీవిస్తాను ప్రతి లోకంలో
జీవమై జీవిస్తాను ప్రతి జీవిలో ధ్యాసగా సాగిపోతాను ప్రతి మేధస్సులో ॥

భావానికైనా తెలియలేదు ఆలోచనకైనా చేరలేదు

భావానికైనా తెలియలేదు ఆలోచనకైనా చేరలేదు
గాలిలోనైనా కనబడలేదు శ్వాసలోనైనా జాడ లేదు
దేహానికైనా స్పర్శ లేదు దైవానికైనా నిలకడ లేదు
మేధస్సుకైనా తోచలేదు విశ్వానికైనా చొరవ లేదు
ఏమీ తెలియని కాల సమయం ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది

Monday, March 14, 2016

జీవితం ఒక విశ్వం

జీవితం ఒక విశ్వం
విశ్వం ఒక గొప్ప జీవిత అధ్యాయం
విశ్వ అధ్యాయం ఒక యుగాంతపు జీవన గమనం
జీవిస్తూ తెలుసుకునేది విశ్వం కాదు
ప్రకృతిని గమనిస్తూ తత్వ భావాలను శ్వాసతో గమనించడమే విశ్వం
విశ్వ భావాలు ప్రకృతి తత్వాలు దివ్యమైన విచక్షణ లక్షణాలతో కూడినవి
సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం చంద్రోస్తమయం విశిష్ట లక్షణాలు
ప్రతి క్షణం ప్రకృతి గమనం ఒక విధానమైన విశ్వ అధ్యాయ సాధన అనుభూతి
క్షణంలోనే ఎన్నో విశ్వ భావాలు మేధస్సులో గుణ లక్షణాలుగా చేరుతుంటాయి
శ్వాస ధ్యాస ప్రకృతి గమనం ఆలోచనలో దాగిన విశ్వ భావ స్వభావ జీవనము
విశ్వంతో జీవించడం మహా విజ్ఞానాన్ని అందుకోవడమే మహా అధ్యాయ జీవితం
ఒక జన్మలో విశ్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడమంటే
'ఆత్మ భావాలను అనుభవంతో గమనిస్తూ విశ్వాన్ని తిలకిస్తూ ఓ శతాబ్ధం జీవించడం'