జీవము నీవై జీవంతర్యామిగా జగతిని పరిశోధిస్తావా
నిత్యము నీవై నిత్యాంతర్యామిగా జీవతిని నడిపిస్తావా
సర్వము నీవై సర్వాంతర్యామిగా విశ్వతిని వెలిగిస్తావా
రూపము నీవై రూపాంతర్యామిగా ప్రకృతిని సృష్టిస్తావా || జీవము ||
ఓ మహాశయా! అంతర్యామివై అంతరిక్షములను తాకావా
ఓ మహాదేవా! అంతరాత్మవై అనంతకార్యములను చూడవా
ఓ మహాదయా! అంతర్భావమై అంతఃకరణములను మీటవా
ఓ మహాత్రయా! అంతర్లీనమై అంతర్భావములను తిలకించవా || జీవము ||
ఓ మహాచరా! జీవంతర్యామివై ఉపనిషత్తులను పలికించవా
ఓ మహాతేజా! రూపాంతర్యామివై వేదములను పరిశోధించవా
ఓ మహాకరా! సర్వాంతర్యామివై సద్భావములను కలిగించవా
ఓ మహాక్రమా! నిత్యంతర్యామివై సర్వేంద్రియములను ఏకీభవించవా || జీవము ||