Tuesday, August 25, 2020

జయ విజయ లక్ష్మి విశ్వ విజయ వాహిని

జయ విజయ లక్ష్మి విశ్వ విజయ వాహిని 
జయ విజయ దేవి మహా మంగల ధారణి 

జయ విజయ నారి నవ సుందర పావని
జయ విజయ రాణి నిత్య సాగర నందిని  

జయ విజయ దుర్గ దివ్య కారుణ్య భవాని 
జయ విజయ మాత సర్వ సాహిత్య కారుణి

Friday, August 21, 2020

శృతిలోనే ఉన్నావా ప్రభూ ప్రభూ

శృతిలోనే ఉన్నావా ప్రభూ ప్రభూ
శృతిలోనే ఉంటావా ప్రభూ ప్రభూ

శృతిలోనే ఊగేదవా ప్రభూ ప్రభూ 
శృతిలోనే ఊరేదవా ప్రభూ ప్రభూ 

శృతిలోనే ఉండిపోయావా స్వర వాణిలా ప్రభూ  
శృతిలోనే ఉలికిపోయావా స్వర జాణిలా ప్రభూ   || శృతిలోనే || 

శృతిలోనే ఊరడించవా నీ లయ గాన గాత్రం 
శృతిలోనే ఉపశమించవా నీ పర ధ్యాన మంత్రం 

శృతిలోనే ఉద్దేశించావా నీ గీత గమన చరణం 
శృతిలోనే ఉద్దరించావా నీ కార్య స్మరణ భరణం   || శృతిలోనే || 

శృతిలోనే ఉప్పొంగించావా నీ వేద నాద భరితం 
శృతిలోనే ఉద్భవించావా నీ భావ తత్వ చరితం 

శృతిలోనే ఉచ్చ్వాసించావా నీ కాల జీవిత సాగరం 
శృతిలోనే ఉచ్చరించావా నీ బాల జీవన మదనం    || శృతిలోనే || 

నా తల్లి శ్వాసలో జీవమై నిత్యం నేనే జీవించెదను

నా తల్లి శ్వాసలో జీవమై నిత్యం నేనే జీవించెదను 
నా తల్లి ధ్యాసలో లీనమై సత్యం నేనే సాగించెదను 

నా తల్లి ఉచ్చ్వాసలో దైవమై సర్వం నేనే గ్రహించెదను 
నా తల్లి నిచ్చ్వాసలో దివ్యమై పర్వం నేనే రచించెదను    

నా తల్లి మేధస్సులో తేజస్సునై నేనే ఉదయించెదను
నా తల్లి దేహస్సులో శ్రేయస్సునై నేనే అవతరించెదను 

నా శ్వాస ధ్యాసలన్నీ నా తల్లి ఎదలో రక్షణగా నిత్యం విశ్వసించేను 
నా యాస భాషలన్నీ నా తల్లి మదిలో శిక్షణగా సర్వం వికాసించేను    || నా తల్లి || 

Thursday, August 20, 2020

విశ్వమంతా విశాల ప్రదేశం

విశ్వమంతా విశాల ప్రదేశం  
జగమంతా జీవుల ప్రదేశం

లోకమంతా జనుల ప్రదేశం 
దేశమంతా ఘనుల ప్రదేశం

జీవుల మేధస్సులతో సాగే దేశ ప్రదేశం దివ్యమైన విజ్ఞాన తేజం 
జీవుల దేహస్సులతో సాగే దైవ ప్రదేశం సవ్యమైన ప్రజ్ఞాన వేదం

సర్వ జీవుల విశ్వ విజ్ఞానం జగమంతా విస్తరించే మహా కార్య పరిశోధనం  || విశ్వమంతా ||